మా అమ్మే బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయమంటుంది.. ప్రేమ లేదు ఓన్లీ సెక్స్ మాత్రమే.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Sep 17, 2018, 12:22 PM IST
Highlights

మహా అయితే బాలీవుడ్ లో ఆమె నటించింది మూడు సినిమాల్లో.. కానీ తన బోల్డ్ స్టేట్మెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుంది హీరోయిన్ భూమి పడ్నేకర్. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. 

మహా అయితే బాలీవుడ్ లో ఆమె నటించింది మూడు సినిమాల్లో.. కానీ తన బోల్డ్ స్టేట్మెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుంది హీరోయిన్ భూమి పడ్నేకర్. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. తన జీవితంలో ప్రేమకి చోటు లేదని చెప్పిన భూమి శృంగారానికి మాత్రం ఎక్కువ ప్రాముఖ్యతనిస్తానని చెప్పింది.

ప్రముఖ ఆంగ్ల పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చిన భూమి.. ప్రేమ, పెళ్లి, సెక్స్ అనే విషయాలపై స్పందించింది. ''నేను ప్రస్తుతం సినిమాలు, ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. వాటి కారణమగానే ఎలాంటి రిలేషన్షిప్స్ పెట్టుకోలేదు.

ప్రస్తుతానికైతే పెళ్లి ఆలోచన లేదు. ప్రేమించే ఉద్దేశం అంతకంటే లేదు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం నా పనే నాకన్నీ. బిజీగా ఉన్న కారణంగా అఫైర్లు పెట్టుకునే సమయం కూడా లేదు. జీవితంలో ప్రేమకి చోటు లేకపోయినా.. సెక్స్ జీవితానికి మాత్రం చోటుంది.

నేను ఎప్పుడూ నా పనితో బిజీగా ఉండడంతో నా తల్లి స్వయంగా నా బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయమని ఎంకరేజ్ చేస్తుంటుంది. ఆమె స్వయంగా వారి వద్దకు పంపిస్తుంటుంది. అయితే నా సెక్స్ జీవితం బహిరంగం అని మాత్రం భావించొద్దు'' అంటూ చెప్పుకొచ్చింది.  

click me!