చావు దాకా వెళ్ళొచ్చాం.. జీవితాలతో చెలగాటం వద్దు, ప్రకాష్ రాజ్ కు బండ్ల గణేష్ కౌంటర్

By telugu teamFirst Published Sep 12, 2021, 2:03 PM IST
Highlights

బండ్ల గణేష్ ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో మా ఎలక్షన్ హీట్ మరింతగా పెరిగింది. జీవితని ప్రకాష్ రాజ్ తన ప్యానల్ లోకి ఇన్వైట్ చేయడం నచ్చని బండ్ల గణేష్ పక్కకు తప్పుకున్నారు.

మా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టాలీవుడ్ లో హీట్ పెరుగుతోంది. గతంలో మాదిరిగానే పరస్పర విమర్శలు వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రధాన పోటీదారులుగా మారారు. మంచు విష్ణు నేరుగా ఎలాంటి విమర్శలు చేయకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. 

ఇక ప్రకాష్ రాజ్ తరచుగా మీడియా మీట్ లో నిర్వహిస్తూ హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నరేష్ వైఫల్యాలు, మా బిల్డింగ్, ఆర్టిస్టుల సంక్షేమం లాంటివి ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారాయి. విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ మధ్య మాత్రమే విమర్శలు ఉంటాయని అంతా భావించారు. 

కానీ బండ్ల గణేష్ ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో మా ఎలక్షన్ హీట్ మరింతగా పెరిగింది. జీవితని ప్రకాష్ రాజ్ తన ప్యానల్ లోకి ఇన్వైట్ చేయడం నచ్చని బండ్ల గణేష్ పక్కకు తప్పుకున్నారు. ఒంటరిగా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. 

ఇదిలా ఉండగా మా ఎన్నికల్లో ఆర్టిస్టుల ఓట్లు దక్కించుకునేందుకు విందు రాజకీయాలు మొదలయ్యాయి. ప్రకాష్ రాజ్ ఓ ఫంక్షన్ హాల్ లో కళాకారులందరికీ విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు సినీ ఆర్టిస్టులని ఇన్వైట్ చేస్తున్నారట. సమస్యలు కలసి చర్చించుకునేందుకు గాను ఈ విందు ఏర్పాటు చేసినట్లు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు చెబుతున్నారు. 

దీనిపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ కి పరోక్షంగా కౌంటర్ ఇస్తూ వీడియో బైట్ పోస్ట్ చేశారు. 'దయచేసి విందులు సన్మానాల పేరుతో మా కళాకారులందరినీ ఒక్క చోటికి చేర్చొద్దు. గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా నా లాంటి వాళ్ళు ఎందరో చావుదాకా వెళ్లి వచ్చాం. మీకు ఓట్లు కావాలని అనుకుంటే ఆర్టిస్టులకు ఫోన్ చేసి మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు వివరించండి. కానీ ఇలా అందరిని ఒక్కచోట చేర్చి వారి జీవితాలతో చెలగాటం ఆడవద్దు' అని బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

It’s my humble request 🙏 pic.twitter.com/fFaXAiEK4g

— BANDLA GANESH. (@ganeshbandla)
click me!