ఫలించిన 23 రోజుల నిరీక్షణ.. ఆర్యన్ ఖాన్‌కు ఊరట, బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్ట్

By Siva Kodati  |  First Published Oct 28, 2021, 4:50 PM IST

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్‌లో వున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. దాదాపు 23 రోజులుగా ఆయన బెయిల్ కోసం న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. 


డ్రగ్స్ కేసులో (drugs case) అరెస్ట్ అయి రిమాండ్‌లో వున్న బాలీవుడ్ (bollywood) సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ (shahrukh khan) కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు (Aryan Khan ) ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. దాదాపు 23 రోజులుగా ఆయన బెయిల్ కోసం న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్యన్‌తో పాటు అర్బాజ్‌ మర్చంట్‌ (arbaaz merchant),  మూన్‌మూన్‌ ధమేచాలకు (munmun dhamecha) కూడా న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఆర్యన్ బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో (bombay high court) గత మూడు రోజుల నుంచి సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. 

ఆర్యన్‌ ఖాన్‌ తరఫున సుప్రీంకోర్ట్ (supreme court) న్యాయవాది ముకుల్‌ రోహత్గీ (mukul rohatgi) వాదనలు వినిపించారు. ఈ వాదనల సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కుట్ర పూరితంగానే ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు ఈ కేసులో ఇరికించారని ముకుల్ ఆరోపించారు. ఆర్యన్‌ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదని.. డ్రగ్స్‌ తీసుకున్నట్టు కూడా వైద్య పరీక్షల ఆధారాలేవీ లేవని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాంటప్పుడు ఆర్యన్‌ ఏరకంగా సాక్ష్యాధారాలను, సాక్ష్యులను ప్రభావితం చేస్తారని రోహత్గీ వాదించారు. 

Latest Videos

undefined

ALso Read:Aryan Khan Case : ప్రత్యక్ష సాక్షి కిరణ్ గోసావి అరెస్ట్...

తనతో పాటు కలిసి వచ్చిన ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్‌ దొరికితే.. ఆర్యన్‌ను ఎలా అరెస్టు చేస్తారు? 20 రోజులకు పైగా ఎలా జైలులో ఉంచుతారు? అని ఆయన ప్రశ్నించారు. ఆర్యన్ ఖాన్ వయస్సును దృష్టిలో ఉంచుకొని అతనికి బెయిల్‌ మంజూరు చేయాలని రోహత్గీ న్యాయస్థానాన్ని కోరారు. అటు ఎన్‌సీబీ తరఫున గురువారం ఏఎస్‌జీ అనిల్‌ సింగ్‌ (anil singh) వాదనలు వినిపించారు. ఆర్యన్‌ డ్రగ్స్‌ వాడటం తొలిసారేమీ కాదని అతను డ్రగ్స్‌ పెడ్లర్లను పలుమార్లు సంప్రదించాడని అనిల్ సింగ్ వాదించారు. డ్రగ్స్‌ విక్రయించే ప్రయత్నంలోనూ ఉన్నట్టు తేలిందన్నారు. ఇరుపక్షాల వాదనలను  విన్న బాంబే హైకోర్టు ఆర్యన్‌తో పాటు అర్బాజ్‌, మూన్‌మూన్‌లకు బెయిల్‌ మంజూరు చేస్తూ తుది తీర్పు వెలువరించింది. 

అక్టోబర్ 2న ముంబమి గోవవా క్రూజ్ నౌకలో రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆర్యన్‌తో పాటు అతని స్నేహితులు అర్బాజ్, మూన్‌మూన్‌లు సహా మరో ఐదుగిరిని అరెస్ట్ చేశారు. అక్టోబర్ 3న ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే (sameer wankhede) ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌ను ధ్రువీకరించారు. అక్టోబర్ 4న ఆర్యన్‌ సహ నిందితుల బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. నాటి నుంచి పలుమార్లు ముంబై కోర్ట్ ఆర్యన్ బెయిల్‌ను తిరస్కరిస్తూ వస్తోంది. దీంతో ఆర్యన్ తరపు న్యాయవాదులు బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 

click me!