అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

Published : Oct 12, 2018, 10:25 AM ISTUpdated : Oct 12, 2018, 10:58 AM IST
అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

సారాంశం

సినిమా ఫీల్డ్ లో స్టార్ హీరోల బాక్స్ ఆఫీస్ రికార్డులు ఎప్పటికప్పుడు మారుతుంటాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కేవలం కాంబినేషన్ సెట్ అయితే చాలు ముందుగానే కలెక్షన్స్ పై ఒక క్లారిటీ వచ్చేస్తోంది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలవడం మొదటి నుంచి అభిమానుల్లో అంచనాలను రేపింది.

సినిమా ఫీల్డ్ లో స్టార్ హీరోల బాక్స్ ఆఫీస్ రికార్డులు ఎప్పటికప్పుడు మారుతుంటాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కేవలం కాంబినేషన్ సెట్ అయితే చాలు ముందుగానే కలెక్షన్స్ పై ఒక క్లారిటీ వచ్చేస్తోంది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలవడం మొదటి నుంచి అభిమానుల్లో అంచనాలను రేపింది. అరవింద సమేత నిన్న రిలీజైన సంగతి తెలిసిందే.

అయితే ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ మూవీ అమెరికాలో సరికొత్త రికార్డులను అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అయిదు సినిమాలతో తారక్ యూఎస్ లో 1 మిలియన్ డాలర్లను క్రాస్ చేశాడు. ఇక ఇప్పుడు అరవింద సమేతతో 6వ సారి ఆ రికార్డును అధిగమించాడు. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలకు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. బుధవారం ప్రీమియర్స్ ద్వారా $797,366 కలెక్షన్స్ అందాయి. ఇక గురువారం రాత్రి 10.30 గంటల వరకు అందిన లెక్కల ప్రకారం $207,870 అందినట్లు తెలుస్తోంది. 

187 సెంటర్లలో మొత్తంగా అరవింద సమేత $1,004,761 లను వసూలు చేసి టాలీవుడ్ సినిమాల సత్తాను చాటింది. కలెక్షన్స్ స్పీడ్ చూస్తుంటే 2 మిలియన్ డాలర్లను అందుకోవడానికి ఎక్కువగా టైమ్ పెట్టె అవసరం లేదని అర్ధమవుతోంది. ఆదివారం నాటికి ఈ చిత్రం 2 మిలియన్ మార్క్ ను ఈజీగా అందుకోగలదని సమాచారం.

 

సంబంధిత వార్తలు

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!

‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: సృష్టి, అమన్ ని పీకి పడేసిన అపూర్వ, మిథిలేష్.. రాగానే రచ్చ లేపారుగా
Divya Bharathi: ఇండస్ట్రీలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే.. అసలు నిజం చెప్పిన హీరోయిన్!