అమ్మాయిలే చీర కొంగు ఎందుకు తీయాలి.. కృష్ణవంశీ - నందిని రెడ్డి ఫైట్!

Published : Oct 11, 2018, 04:51 PM IST
అమ్మాయిలే చీర కొంగు ఎందుకు తీయాలి.. కృష్ణవంశీ - నందిని రెడ్డి ఫైట్!

సారాంశం

అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నందినిరెడ్డి. ఆ తరువాత జబర్దస్త్ - కళ్యాణవైభోగమే సినిమాలు చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆమె సహాయ దర్శకురాలిగా కృష్ణవంశీ దగ్గర పనిచేసిన సంగతి తెలిసిందే. 

అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నందినిరెడ్డి. ఆ తరువాత జబర్దస్త్ - కళ్యాణవైభోగమే సినిమాలు చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆమె సహాయ దర్శకురాలిగా కృష్ణవంశీ దగ్గర పనిచేసిన సంగతి తెలిసిందే. చంద్రలేఖ సమయం నుంచి నందిని రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. 

అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మురారి షూటింగ్ సమయంలో కృష్ణవంశీతో గొడవైన విషయం గురించి ప్రస్తావించారు. మోకాళ్ల మీద ఉండి మహేష్ బాబును చూస్తూ సోనాలి బింద్రే కొంగు తీయాలి. అయితే కృష్ణవంశీ గారికి అది చెప్పడం రాక నన్ను పిలిచి షాట్ గురించి చెప్పమన్నారు. నేను చెప్పనని అన్నా. అప్పుడు ఆయన చెప్తావా? లేదా అని నాపై గట్టిగా అరీచేశారు. దీంతో అమ్మాయిలే ఎందుకు అలా అడగాలి అనడంతో నా సర్వస్వం నీకే అర్పిస్తున్నా అని మీనింగ్ తెలుపడానికి అలా చేయాలనీ కృష్ణవంశీ చెప్పారు. 

నేను కోపంతో.. అయితే అలాంటప్పుడు అబ్బాయిలు సర్వస్వం ఇవ్వాలంటే ప్యాంట్ విప్పుతారా? అని అనేశాను. అప్పుడు కృష్ణవంశీ గారు మరింత కోపంతో వెళ్లి నేను చెప్పింది చెప్పు.. కాళ్లు విరగ్గొడతా అనగానే ఏమనకుండా వెళ్ళిపోయా అని నందిని రెడ్డి అప్పటి జ్ఞాపకాలను నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?