'అరవింద సమేత'.. సోమవారం కలెక్షన్లు డ్రాప్!

By Udayavani DhuliFirst Published Oct 16, 2018, 11:37 AM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం అందుకుంది. భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అయితే సోమవారం నాటికి సినిమా పరిస్థితి దెబ్బతింది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం అందుకుంది. భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అయితే సోమవారం నాటికి సినిమా పరిస్థితి దెబ్బతింది.

గత గురువారం విడుదలైన ఈ సినిమా వీకెండ్ లో భారీ వసూళ్లను రాబట్టింది. కాస్త డివైడ్ టాక్ ఉండడంతో సోమవారం కలెక్షన్లు ఎలా ఉంటాయని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నాడు ఈ సినిమా కలెక్షన్లు డ్రాప్ అయినట్లు సమాచారం.

చాలా చోట్ల వసూళ్లు పాతిక శాతానికి పడిపోయాయని అంటున్నారు. హైదరాబాద్ లో మార్నింగ్ షో ఫుల్ అయితే రూ.1.25 లక్షల గ్రాస్ వచ్చే ఓ మెయిన్ థియేటర్ లో సోమవారం ఉదయం 33వేల గ్రాస్ మాత్రం వచ్చింది.

ఒక థియేటర్ నుండి 'అరవింద సమేత' సినిమాను తీసేశారు. కొన్ని థియేటర్లలో తొంబై శాతం ఆక్యుపెన్సీతో నడిచినట్లు తెలుస్తోంది. దసరా సెలవులు కాబట్టి సినిమా మళ్లీ పుంజుకొని తన సత్తా చాటే అవకాశం లేకపోలేదు!

సంబంధిత వార్తలు..

అరవింద సమేత: మూడు రోజుల కలెక్షన్స్!

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

click me!