డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హాండెడ్ గా దొరికిపోయిన టాప్ హీరోయిన్

First Published Sep 7, 2017, 12:03 PM IST
Highlights
  • డ్రగ్స్ కేసులో పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలను విచారించిన సిట్
  • ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయని సిట్
  • తాజాగా మరో ముగ్గురు సెలెబ్రిటీల్లో ఓ టాప్ హిరోయిన్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సెలెబ్రిటీల విచారణ పర్వం తెలిసిందే. తెలుగు సినీపరిశ్రమకు చెందిన 12 మంది టాలీవుడ్ సెలెబ్రిటీలను డ్రగ్స్ కేసులో విచారణకు పిలిచి ప్రతి ఒక్కరినీ గంటలకొద్దీ విచారించింది సిట్.

 

మొత్తం టాలీవుడ్ ను షేక్ చేసిన ఈ సిట్ విచారణ ఎటు దారితీస్తుందోనని అటు ఇండస్ట్రీ వర్గాలతోపాటు తెలుగు ప్రజలంతా సిట్ విచారణ తీరును ఆసక్తిగా గమనించారు. మీడియా కూడా నిమిష నిమిషానికి అప్ డేట్స్ ఇస్తూ తెగ కవరేజ్ ఇచ్చింది. అయితే సిట్ అధికారులు మాత్రం ఒక్కరిని కూడా అరస్ట్ చెయ్యకుండా పక్కన పెట్టేసారు. అవసరం ఐనవారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఊరుకున్నారు.

విచారణకు హాజరైన సెలెబ్రిటీలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరొక ముగ్గురి పేర్లు తెలుసుకున్న సిట్,  వాళ్ల పై నిఘా పెట్టి డ్రగ్స్ సేవిస్తున్న సమయంలో పక్కాగా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఏకంగా వీడియోలు సేకరించిన అధికారులు ఆ ముగ్గురికీ కూడా ఇప్పటికే నోటీసులు పంపినట్టు సమాచారం. ఈ ముగ్గురి విషయంలో సిట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీడియాకు లీక్ చెయ్యకుండా జాగ్రత్త పడుతోంది.

 

అయితే ఈముగ్గురిలో ఒక నటి టాలీవుడ్ లో టాప్ సెలెబ్రిటీ అని అంటున్నారు. టాలీవుడ్ లో ఇన్నాళ్ళగా అగ్ర కథానాయక గా చలామణీ అవుతున్న ఆమె.. తన అసిస్టంట్ వల్లనే ఇందులో ఆధారాలతో సహా ఇరుక్కుందని తెలుస్తోంది. ఓ పార్టీలో డ్ర‌గ్స్ తీసుకొని, అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌లేనంత మ‌త్తులో కూరుకుపోయిన ఆ టాప్ నటి వీడియో సిట్ వాళ్ల‌కు ల‌భ్యమైంద‌ట‌. సిట్ త‌దుప‌రి టార్గెట్ ఆ క‌థానాయికే అని తెలుస్తోంది.

click me!