చిరంజీవి కోసం ఫ్యామిలీ మొత్తం.. పవన్ క్రేజ్ పై అమితాబ్ కామెంట్స్!

Published : Sep 28, 2019, 04:20 PM IST
చిరంజీవి కోసం ఫ్యామిలీ మొత్తం.. పవన్ క్రేజ్ పై అమితాబ్ కామెంట్స్!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించబోతోంది. మెగాస్టార్ 151వ చిత్రంగా తెరకెక్కిన సైరాని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. 

సైరా చిత్రాన్ని దాదాపు 250 కోట్ల ఖర్చుతో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించాడు. తన తండ్రికి తాను ఇచ్చే కానుక ఈ చిత్రం అని చరణ్ పలు సందర్భాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న సైరా చిత్రం అక్టోబర్ 2న దక్షణాది భాషాలతో పాటు హిందీలో కూడా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. 

చిరంజీవి, రాంచరణ్, సురేందర్ రెడ్డి ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. సైరా చిత్ర యూనిట్ ప్రస్తుతం ముంబై, చెన్నై లాంటి మహానగరాలని చుట్టేస్తోంది. సైరా చిత్రంలో కీలక పాత్రలో నటించిన తమన్నా కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. 

సైరా చిత్రంలో బిగ్ బి అమితాబ్ చిరంజీవి గురువు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేస్తున్న ఫరాన్ అక్తర్ తాజాగా చిరంజీవిని, అమితాబ్ ని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి సైరా విశేషాలు చెబుతూ.. సైరా చిత్రానికి తన సోదరుడు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించాడని అన్నారు. 

వెంటనే అమితాబ్ స్పందించి పవన్ కళ్యాణ్ కు సాధారణమైన వ్యక్తి కాదు.. అతడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సైరా చిత్రంలో పనిచేసేందుకు చిరంజీవి కుటుంబం మొత్తం ముందుకు వచ్చింది. ఇది చాలా మంచి విషయం అని అమితాబ్ ప్రశంసించారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?