బుట్టబొమ్మ పాటకు వార్నర్ డ్యాన్స్ వీడియో వైరల్, బన్నీ స్పందన ఇదీ...

By Surya PrakashFirst Published Apr 30, 2020, 5:44 PM IST
Highlights


యూట్యూబ్‌లో ఈ పాట కోట్లాది వ్యూస్‌ సాధిస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. ఇదే పాటకు ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి డ్యాన్స్ చేసి అదరగొట్టాడు. ఆ‌ దంపతులు డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో వారి కుమార్తె కూడా స్టెప్పులు వేస్తూ కనపడింది.   


‘అల వైకుంఠపురములో’ని ‘బుట్ట బొమ్మ’  పాట ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఆ సినిమాలోని ‘సామజవరగమన’, ‘రాములో రాములా’, ‘ఓ మైగాబడ్‌ డాడీ’ పాటలన్ని దాటి ఈ సాంగ్  శ్రోతల్ని అలరించింది. ‘బుట్ట బొమ్మ’ అంటూ సాగే ఈ పాటను అర్మాన్‌ మాలిక్‌ ఆలపించాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా తమన్‌ స్వరాలు సమకూర్చారు. యువతను బాగా ఆకట్టుకుంది.
అంతేకాక ‘బుట్టబొమ్మ’ పాటకు అల్లు అర్జున్ స్టెప్పులు అదరగొట్టేసాడు.

యూట్యూబ్‌లో ఈ పాట కోట్లాది వ్యూస్‌ సాధిస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. ఇదే పాటకు ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి డ్యాన్స్ చేసి అదరగొట్టాడు. ఆ‌ దంపతులు డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో వారి కుమార్తె కూడా స్టెప్పులు వేస్తూ కనపడింది.   

 సోషల్ మీడియాలో ఆ వీడియో ఎంతో వైరల్ గా మారింది. దీనిపై టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ స్పందించాడు. "థ్యాంక్యూ వెరీ మచ్. మీ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశాడు. బన్నీ ట్వీట్ పట్ల వార్నర్ సైతం అంతే వినమ్రంగా బదులిచ్చాడు. 'థాంక్యూ సర్. మీ పాట అద్భుతంగా ఉంది" అంటూ ట్వీట్ చేశాడు.

ఈ పాటలోని ‘అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే.. గాజుల చేతులు జాపి దగ్గరికొచ్చిన నవ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేశావు’ అనే చరణం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్టైంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో టబు, సుశాంత్‌, నవదీప్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

 ఇక  కరోనాతో ఐపీఎల్ జరగకపోవడంతో ఇంట్లోనే ఉంటోన్న డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండిస్‌తో కలిసి ఈ మధ్య పదే పదే టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వాటిని పోస్ట్ చేస్తున్నాడు.  ఈ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో.. వార్నర్‌ సన్‌రైజర్స్‌ టీ షర్ట్‌ ధరించారు. వార్నర్‌ దంపతులు డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో వారి కుమార్తె ఇండి కూడా వెనకాల తిరుగుతూ తనకు తోచిన స్టెప్పులు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను వార్నర్‌ దంపతులు వారి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లలో పోస్ట్‌ చేశారు. 

ఈ వీడియోను పోస్ట్‌ చేసిన క్యాండిస్‌.. ‘ఇండి మొత్తం షోను దొంగిలించిందని’ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా, ఐపీఎల్‌ సీజన్‌ అప్పుడు ఎక్కువ సమయం హైదరాబాద్‌లో గడుతున్న వార్నర్‌.. తెలుగు వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు. అందులో భాగంగానే తెలుగు అభిమానుల అలరించడం కోసం బుట్టబొమ్మ సాంగ్‌కు చిందేసినట్టుగా తెలుస్తోంది.

 

Check out this cute TikTok video of dancing for song pic.twitter.com/zB9Ywzi5xI

— Asianet News Telugu (@asianet_telugu)
click me!