ఉగ్రం నుంచి అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ రిలీజ్, మరో సారి సీరియస్ లుక్ లో కామెడీ హీరో

By Mahesh JujjuriFirst Published Aug 22, 2022, 11:50 AM IST
Highlights

మరో సారి ప్రయోగానికి రెడీ అయ్యాడు అల్లరి నరేష్. కామెడీ హీరోగా ఉన్న హీరో.. సడెన్ గా సీరియస్ పాత్రలవైపు దృష్టి పెట్టాడు. ఈక్రమంలోనే మరో సారి సీరియస్ లుక్ లో కనిపించాడు. 

కామెడీ హీరోగా దాదాపు  50 సినిమాలను పూర్తి చేసుకున్నాడు అల్లరి నరేష్.  రాజేంద్ర ప్రసాద్ తరువాత ఆరేంజ్  లో ఆడియన్స్ ను నవ్వించిన కామెడీ2  హీరో నరేష్ తప్పించి మరెవరూ లేదు. ఈక్రమంలోనే హాఫ్ సెంచిరీ తరువాత  తన సినిమాలకు ఆదరణ తగ్గిపోతుంది అని గమనించిన హీరో..  విలక్షణమైన పాత్రలవైపు మళ్లాడు. ఆ జానర్ లో కూడా  తన సత్తా చాటుకున్నాడు. అలా ఆ మధ్య వచ్చిన నాంది'సినిమా సూపర్ సక్సెస్ ను సాధించింది. కొత్త దర్శకుడైనా.. విజయ్ కనకమేడలకు ఈ సినిమాను అద్భుుతంగా డ్రైవ్ చేశాడు. అంతే కాదు ఈమూవీ సక్సెస్ తో అతనికి కూడా మంచి పేరు వచ్చింది. 

ఇక నెక్ట్స్ కూడా అదే  దర్శకుడితో అల్లరి నరేశ్ మరో సినిమా చేస్తున్నాడు. ఉగ్రం అనే డిఫరెంట్ టైటిల్ తో నరేష్ డిపరెంట్ లుక్ తో తెరకెక్కుతోన్న సినిమా అది. ఇక ఈసినిమా నుంచి ఈరోజు అల్లరి నరేష్ పస్ట్ లుక్  పోస్టర్ ను రిలీజ్ చేశారు. వీపులో దిగబడిన కత్తి తో .. రక్తం కారుతున్న శరీరంతో  అల్లరి నరేష్ సరికొత్తగా కనిపించాడు. ఈ పాత్రలో ఆవేశం, ఆక్రోశం రెండు కనిపించాయి. టైటిల్ కు తగ్గట్టు పోస్టర్ ను అద్భుతంగా డిజైన్ చేశారు మేకర్స్. 

సాహు గారపాటి -  హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమాకి, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. నాంది తరువాత అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. అయితే నాంది లాగానే ఈ సినిమా కూడా సీరియస్ లుక్ తో ఉండటంతో.. ఆసినిమా ప్రభావం దీనిపై పడే అవాకాశం ఉంది అంటున్నారు. ఒక వేల  రోటీన్ స్టోరీతో ఈ సినిమావస్తే... ఈసారి అల్లరోడు సక్సెస్ కష్టమనే చెప్పాలి. కొత్తదనం ఉంటే..అల్లరి నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ సక్సెస్ అయినట్టే. 

click me!