క్యాబ్ డ్రైవర్ వేధించాడు... డ్రగ్స్ ఆరోపణల అనంతరం మరోసారి వార్తలకెక్కిన హీరోయిన్ సంజనా గల్రాని

By team teluguFirst Published Oct 6, 2021, 9:12 AM IST
Highlights

Sanjana galrani కొన్ని ఆధారాలతో సహా ఓలా యాజమాన్యానికి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. అదే సమయంలో 100 కి కాల్ చేసిన, డ్రైవర్ పై పోలీసు కంప్లైంట్ ఇచ్చినట్లు సమాచారం.

కన్నడ నటి సంజనా గల్రాని మరోమారు వార్తలలో నిలిచారు. ఓ క్యాబ్ డ్రైవర్ తనను ఇబ్బందులకు గురి చేసినట్లు ఓలా యాజమాన్యంతో పాటు, పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం షూటింగ్ లొకేషన్ కి వెళ్లడం కోసం బెంగుళూరులోని ఇందిరానగర నుండి రాజేశ్వరి నగరకు సంజనా ఓలా క్యాబ్ బుక్ చేశారు. అయితే సదరు ఓలా డ్రైవర్ కార్ ఏసీ పెంచకుండా ఇబ్బందిపెట్టడంతో పాటు, నిర్లక్ష్యంగా వ్యవహరించాడని సంజనా ఆరోపిస్తున్నారు. నలుగురు వ్యక్తులు ఉన్న కార్ లో ఏసీ ఒకటి వద్ద ఉంచాడని, ఏసీ స్థాయి పెంచాలని అడిగితే, నిరాకరించాడని తెలియజేశారు.


అన్ని సౌకర్యాలకు డబ్బులు పూర్తిగా వసూలు చేస్తూ ఇలాంటి సర్వీస్ ఇస్తారా? కారు కండీషన్ కూడా సరిగా లేదని, విండ్ షీల్డ్ కి పగుళ్లు ఉన్నాయని ఆమె వెల్లడించారు. Sanjana galrani కొన్ని ఆధారాలతో సహా ఓలా యాజమాన్యానికి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. అదే సమయంలో 100 కి కాల్ చేసిన, డ్రైవర్ పై పోలీసు కంప్లైంట్ ఇచ్చినట్లు సమాచారం. 

అయితే ఓలా క్యాబ్ డ్రైవర్ వర్షన్ మరోలా ఉంది. కారులో ఎక్కిన తరువాత లొకేషన్ మార్చమన్నారని, కస్టమర్ కేర్ తో మాట్లాడిన తరువాత అది కుదరదని చెప్పడంతో ఆమె, దుర్భాషలాడారని చెబుతున్నాడు.ఈ సంఘటనను వీడియో తీసిన క్యాబ్ డ్రైవర్, సంజనా గల్రానిపై రాజేశ్వరినగర పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ వివాదంలో తప్పు ఎవరిదైనా పరస్పరం పోలీసు కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు. 

Also Read  నా ఛాతిపై అసభ్యంగా తాకాడు... సింగర్ పై ప్రముఖ మోడల్ లైంగిక ఆరోపణలు


గత ఏడాది సెప్టెంబర్ లో డ్రగ్స్ ఆరోపణలపై సంజనా గల్రాని అరెస్ట్ కాబడ్డారు. పలుమార్లు ఆమె బెయిల్ కోసం ప్రయత్నించినా లభించలేదు. జైలులో సంజనా గాయాలుపాలు కావడం జరిగింది.  దాదాపు మూడు నెలల జైలు జీవితం గడిపిన సంజనా గల్రాని బెయిల్ పై విడుదలయ్యారు. విడుదల అనంతరం ఆమె తన బాయ్ ఫ్రెండ్ అజీజ్ పాషా ను రహస్య వివాహం చేసుకున్నారు. 
 

Car number Ka 50 - 8960 , we are Harrassed early morning by this driver named Susay mani s , Not increasing the A/c from speed level one ,
We are 4 people in car he is suffocating us . Full story in pic below pic.twitter.com/ivxwgeB7LL

— Sanjjanaa Galrani (@sanjjanagalrani)
click me!