క్రిమినల్స్ తో పోలీసుల స్నేహం.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

By Prashanth MFirst Published Oct 11, 2019, 11:29 AM IST
Highlights

మీరా మిథున్ తమిళనాడు ప్రభుత్వంపై ఊహించని విధంగా ఆరోపణలు చేశారు. ఒకానొక సమయంలో పోలీసుల వైఖరికి మనోవేదనకు గురయ్యానని చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు ఇటీవల ఆమె తరచు పలు వివాదాలతో చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నారు. బిగ్ బాస్ హౌజ్ నుంచి కూడా వెలివేయాల్సి వచ్చింది.

సూర్య గ్యాంగ్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించిన మీరా మిథున్ తమిళనాడు ప్రభుత్వంపై ఊహించని విధంగా ఆరోపణలు చేశారు. ఒకానొక సమయంలో పోలీసుల వైఖరికి మనోవేదనకు గురయ్యానని చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు ఇటీవల ఆమె తరచు పలు వివాదాలతో చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నారు. బిగ్ బాస్ హౌజ్ నుంచి కూడా వెలివేయాల్సి వచ్చింది.  

గతంలో బ్యూటీ కంటెస్టెంట్ లో గెలుపొందిన ఆమె అవార్డును కూడా వివాదాల కారణంగా వెనక్కి తిరిగి ఇచ్చేశారు. అందాల పోటీల కోసం కొంతమంది మహిళల వద్ద డబ్బు తీసుకొని మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ కారణంగా మిస్‌ సౌత్‌ ఇండియా బ్యూటీ అవార్డు వెనక్కి తీసుకున్నారు. హత్య బెదిరింపు కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.  

"తమిళనాడులో శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయి. అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం ఉక్కు మహిళ మృతి తర్వాత రాష్ట్రంలో చాలావరకు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. రాజకీయ నాయకులకు చదువుకున్న అర్హత తప్పనిసరిగా ఉండాలి. మహిళలపై అకృత్యాలు వేధింపులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో పోలీసులు క్రిమినల్స్ తో స్నేహం చేస్తున్నారు. నేను చేసిన పిర్యాదులు కమిషనర్ తో పాటు ఏ పోలీస్ కూడా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది" అని మీరా వివరణ ఇచ్చారు.

click me!