పాకిస్థాన్, చైనా నుండి బాలీవుడ్ కి డ్రగ్స్...పార్లమెంట్ లో ధ్వజమెత్తిన ఎంపీ రవి కిషన్

By Satish ReddyFirst Published Sep 14, 2020, 2:59 PM IST
Highlights

బాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియా కేసు దుమారం రేపుతుండగా నటుడు మరియు ఎంపీ రవికిషన్ పార్లమెంట్ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. శత్రు దేశాలైన పాకిస్థాన్, చైనా నుండి అక్రమంగా ఇండియాలోకి డ్రగ్స్ రవాణా అవుతున్నాయని అన్నారు.

డ్రగ్స్ ఆరోపణలు బాలీవుడ్ ని కుదిపేస్తున్నాయి. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో మొదలైన అశాంతి, డ్రగ్స్ ఆరోపణలతో మరింత దుర్భరంగా తయారైంది. తాజా పరిస్థితులు బాలీవుడ్ లో అనేక మందికి చెమటలు పట్టిస్తున్నాయి. డ్రగ్స్ ఆరోపణలపై ఇప్పటికే అనేకమంది అరెస్ట్ జరిగింది. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి, షోవిక్ చక్రవర్తితో పాటు డ్రగ్ పెడ్లర్స్ అరెస్ట్ కాబడ్డారు. దేశవ్యాప్తంగా సంచలంగా మారిన ఈ వ్యవహారంపై నటుడు మరియు పార్లమెంట్ సభ్యుడు రవి కిషన్ లోక్ సభలో ప్రస్తావించారు.
 
బాలీవుడ్ డ్రగ్ మాఫియాకు అడ్డాగా మారిందని ఆయన అన్నారు. ఇతర దేశాల నుండి డ్రగ్స్ భారత్ లోకి అక్రమ రవాణా అవుతున్నాయి అన్నారు. పాకిస్థాన్, చైనా వంటి దేశాలు మన దేశ యువత భవిష్యత్తు నాశనం చేయడానికి దేశంలోకి డ్రగ్స్ రవాణా చేస్తున్నాయి అన్నారు. నేపాల్, పంజాబ్ నుండి డ్రగ్స్ దేశంలోకి వస్తున్నాయని రవి కిషన్ అన్నారు. 

దేశ ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే ఈ డ్రగ్స్ రవాణా అరికట్టాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే డ్రగ్స్ ఆరోపణలపై ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేయడంపై రవి కిషన్ సంతోషం వ్యక్తం చేశారు. డ్రగ్ మాఫియాతో సంబంధం ఉన్న మిగిలిన నేరస్థులను కూడా అరెస్ట్ చేసి, దేశంలోకి డ్రగ్స్ రాకుండా అడ్డుకట్ట వేయాలని కోరుకున్నారు. 

click me!