మ్యాస్ట్రో నుండి స్నీక్ పీక్.. ఆసక్తి రేపుతున్న వీడియో

By team teluguFirst Published Aug 30, 2021, 12:26 PM IST
Highlights

విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు టీమ్. నేడు మ్యాస్ట్రో చిత్రం నుండి స్నీక్ పీక్ విడుదల చేశారు. నితిన్ లయబద్దంగా పియానో వాయిస్తుండగా,మధ్యలో పియానో ట్రబుల్ ఇస్తుంది. 

ఒక హిట్ అందితే వరుసగా రెండు మూడు ప్లాప్స్ రావడం మొదటి నుండి హీరో నితిన్ ని వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్.  భీష్మ సినిమాతో ఫార్మ్ లోకి వచ్చాడనుకుంటే.. రంగ్ దే, చెక్ చిత్రాలకు ఆయనకు చుక్కలు చూపించాయి. మ్యాస్ట్రో చిత్రంతో అయినా విజయాన్ని అందుకోవాలని నితిన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీ హిట్ చిత్రం అందాధున్ తెలుగు రీమేక్ అయిన మ్యాస్ట్రో షూటింగ్ చక చకా ముగించాడు నితిన్. 


ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నడుస్తుండగా, థియేటర్ రిలీజ్ ఉంటుందని అందరూ భావించారు. అనూహ్యంగా ఓటిటికి ఓటేశాడు నితిన్. లాభాల లెక్కలు చూసుకొని రిస్క్ చేయడం ఎందుకని, డిస్ని హాట్ స్టార్ లో మ్యాస్ట్రో విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 17నుండి మ్యాస్ట్రో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. మ్యాస్ట్రో ప్రయోగాత్మక చిత్రం, టాక్ అటు ఇటు అయితే అసలకే మోసం వస్తుంది. అందుకే నితిన్ ఓటిటి దారి ఎంచుకున్నారు. ఇది ఒక రకంగా నితిన్ ఫ్యాన్స్ ని నిరాశపరిచే అంశమే. 


విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు టీమ్. నేడు మ్యాస్ట్రో చిత్రం నుండి స్నీక్ పీక్ విడుదల చేశారు. నితిన్ లయబద్దంగా పియానో వాయిస్తుండగా,మధ్యలో పియానో ట్రబుల్ ఇస్తుంది. ట్యూన్ పూర్తి కాలేదు. మళ్ళీ రిపేరా అంటూ నితిన్ అసహనం వ్యక్తం చేస్తున్న సన్నివేశం అది. 


కృష్ణగాడి వీరప్రేమ గాధ ఫేమ్ మేర్లపాక గాంధీ మ్యాస్ట్రో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, కీలకమైన నెగిటివ్ రోల్ తమన్నా చేయడం విశేషం. ఈ మూవీలో తమన్నా కొన్ని బోల్డ్ సన్నివేశాలలో కూడా కనిపించనున్నారని సమాచారం. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మిస్తున్నారు.

click me!