''సెక్స్ రాకెట్ లో దొరికింది నేను కాదు.. అతడు నాలానే ఉంటాడు''

By telugu news teamFirst Published Mar 5, 2020, 10:58 AM IST
Highlights

'జబర్దస్త్' ఆది టీమ్ లో స్కిట్ లు చేసే దొరబాబు, పరదేశి వైజాగ్ లో సెక్స్ రాకెట్ లో బుక్కయ్యారు. ఈ ఇద్దరు నటులతో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు ఎయిర్ పోర్ట్ పోలీసులు. 

సెక్స్ రాకెట్ లో దొరికిన నటుడిని నేను కాదంటూ వాపోతున్నాడు టాలీవుడ్ యాక్టర్ దావూద్. నిజానికి ఇతడు 'జబర్దస్త్' దొరబాబుని పోలి ఉంటాడు. అందుకే ఆ షో డబుల్ యాక్షన్ థీమ్ సందర్భంగా ఈ నటుడు కూడా దొరబాబుతో కలిసి నటించాడు.

అయితే 'జబర్దస్త్' ఆది టీమ్ లో స్కిట్ లు చేసే దొరబాబు, పరదేశి వైజాగ్ లో సెక్స్ రాకెట్ లో బుక్కయ్యారు. ఈ ఇద్దరు నటులతో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు ఎయిర్ పోర్ట్ పోలీసులు. అయితే చాలా మంది ఈ విషయంలో దావూద్ కి ఫోన్ చేసి తిడుతున్నారట.

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ 'జబర్దస్త్' కమెడియన్స్!

దాంతో అతడు మీడియా ముందుకు వచ్చి తన గోడుని చెప్పుకొని బాధ పడుతున్నాడు. నటుడిగా దావూద్ 'ఖైదీ నెం 1', 'డియర్ కామ్రేడ్', 'అర్జున్ సురవరం', 'భీష్మ' వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. దొరబాబుకి సంబంధించిన వీడియోలు చూశానని, కానీ ఆ వీడియోల్లో మాత్రం ఉన్నది తాను కాదని.. దయచేసి తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని దావూద్ కోరుతున్నాడు.

దొరబాబు విషయంలో కూడా తాను బాధ పడుతున్నానని.. అలా ఎందుకు జరిగిందో అర్ధం కావడం లేదని అన్నారు. అలాంటి పనులు తాను చేయనని.. దయచేసి అర్ధం చేసుకోమని దావూద్ నెటిజన్లను, సన్నిహితులను కోరుతున్నాడు. 

click me!