ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాణం ఆ మిత్రుడే

By team teluguFirst Published Sep 25, 2020, 1:27 PM IST
Highlights

బాలు అంటే విఠల్, విఠల్ అంటే బాలు అనే విధంగా ఉండేవారు. పాట రికార్డింగ్ జరుగుతుంటే విఠల్ ఇంజనీరు వెనక నిలుచుని ఉండేవాడు. బాలు, ఆయన సైగలు చేసుకునేవారు. 

శ్రీపండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అయిన ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం వెంట మిత్రుడు విఠల్ నడుస్తూ వచ్చాడు. ఎస్పీ బాలు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు స్నేహితుడయ్యాడు విఠల్. ఆయనది నెల్లూరు. 

ఇంజనీరింగ్ చదువుతూ ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంతో మద్రాసు వెళ్లాడు. ఆ తర్వాత ఎస్బీ అపాయింట్మెంట్స్, అన్నీ ఆయన చూసుకునేవాడు. విఠల్ తన ప్రాణమని ఓ సందర్భంలో బాలసుబ్రహ్మణ్యం చెబుకున్నారు. ఆయన పాన్ పరాగ్ వేసుకుని మాట్లాడుతుంటాడట. వేల ఫోన్ నెంబర్లు అతను గుర్తుంచుకునేవాడని బాలు అలీతో సరదాగా అనే ఇంటర్వ్యూలో చెప్పారు.

బాలు అంటే విఠల్, విఠల్ అంటే బాలు అనే విధంగా ఉండేవారు. పాట రికార్డింగ్ జరుగుతుంటే విఠల్ ఇంజనీరు వెనక నిలుచుని ఉండేవాడు. బాలు, ఆయన సైగలు చేసుకునేవారు. 

బాలసుబ్రహ్మణ్యానికి పల్లవి అనే కూతురు, చరణ్ అనే కుమారుడు ఉన్నారు. హాస్యనటుడు అలీ చిన్నప్పటి నుంచి వాళ్ల ఇంటి పక్కనే ఉండేవాడు. అలీకి చరణ్ కు మధ్య స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది.

బాలసుబ్రహ్మణ్యం 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. ఆ గొంతు ఇప్పుడు మూగబోయింది.

click me!