ఇండియాకు తీసుకెళ్లండి.. అమెరికాలో చిక్కుకున్న నటి ఆవేదన

By Satish ReddyFirst Published Apr 16, 2020, 3:09 PM IST
Highlights
అమెరికాలో చిక్కుకున్న ఓ భామ భారత ప్రభుత్వ సాయం కోరింది. బాలీవుడ్‌ యాక్ట్రస్‌ సౌందర్య శర్మ అమెరికాలోని ఇండియన్‌ ఎంబసీతో పాటు విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించింది. తనతో పాటు అమెరికాలోనే ఉండిపోయిన వందలాది మంది స్టూడెంట్స్‌ను ఇండియాకు చేర్చాలని ఆమె ప్రాదేయపడింది.
కరోనా భయంతో ప్రపంచమంతా స్థంభించిపోయింది. ఒక్కసారి చాలా దేశాల్లో లాక్‌ డౌన్‌లు ప్రకటించటంతో ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. చాలా మంది స్వదేశాలకు చేరుకోలేక ఇబ్బంది పడుతున్నారు. పలువురు సెలబ్రిటీలు సినీ తారులుకూడా ఇలా చిక్కుకుపోయిన వారిలో ఉన్నారు. ముఖ్యంగా ఇటలీ, అమెరికా లాంటి దేశాల్లో చిక్కుకున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది.

ఆ దేశాల్లో ఉన్న పరిస్థితులు అక్కడ నమోదవుతున్న కేసులను చూసి భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో చిక్కుకున్న ఓ భామ భారత ప్రభుత్వ సాయం కోరింది. బాలీవుడ్‌ యాక్ట్రస్‌ సౌందర్య శర్మ అమెరికాలోని ఇండియన్‌ ఎంబసీతో పాటు విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించింది. తనతో పాటు అమెరికాలోనే ఉండిపోయిన వందలాది మంది స్టూడెంట్స్‌ను ఇండియాకు చేర్చాలని ఆమె ప్రాదేయపడింది.

`ఇది అందరం ఆపదలో ఉన్న సమయం, చాలా మంది విద్యార్ధులతో పాటు ఇండియన్స్‌ ఇక్కడ సరైన వసతులు లేక తిండి సరిగ్గా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అందుకే నేను ఇండియన్‌ ఎంబసీని, విదేశీ మంత్రిత్వ శాఖను సంప్రదించాను. నాతో పాటు వీరందరినీ అమెరికా నుంచి ఇండియాకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నా. ఈ అభ్యర్థనకు సరైన రెస్సాన్స్‌ వస్తుందని ఆశిస్తున్నా` అంటూ కామెంట్ చేసింది.

అంతేకాదు తానే ఇప్పుడు తరలించటం సాధ్యం కాదేమో అన్న అనుమానం కూడా వ్యక్తం చేసింది. ప్రస్తుతం కరోనా విజృంభన తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో అందరినీ రక్షించటం అయ్యే పని కాదేమో. కానీ ఏ మాత్రం అవకాశం ఉన్నా, ఒక ఎవాక్యూవేషన్‌ ఫ్లైట్‌ను పంపి ఇక్కడి వారిని రక్షించాలని కోరింది. సౌందర్య శర్మ విషయానికి వస్తే.. ఆమె లాస్‌ ఏంజెల్స్‌లోని ఓ ఫిలిం ఇన్సిస్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకునేందుకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయింది.
click me!