జగిత్యాల యువకుడికి కరోనా లక్షణాలు... గాంధీకి తరలింపు

By Arun Kumar PFirst Published Mar 6, 2020, 4:29 PM IST
Highlights

ప్రపంచాన్నిగడగడలాడిస్తున్న కరోనా వైరస్ తెలుగు  ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్ బారినపడ్డ బాధితున్ని ఇప్పటికే హైదరాబాద్ లో గుర్తించగా మరిన్ని అనుమానిత కేసులు నమోదవుతున్నాయి.   

హైదరాబాద్: చైనాతో పాటు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారత్ లోనూ మెల్లమెల్లగా విజృంభిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ బారినపడ్డ బాధితులను గుర్తించారు. ఇలా తెలంగాణలో కూడా ఓ వ్యక్తి ఈ కరోనా బారినపడ్డట్లు బయటపడటంతో తెలుగు ప్రజల్లో తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. కేవలం హైదరాబాద్ కే ఈ వైరస్ పరిమితం అయ్యిందనుకుంటుండగా తాజాగా జిల్లాల్లో కూడా అనుమానిత కేసులు నమోదవుతున్నారు. 

జగిత్యాల జిల్లాలో కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని వైద్యులు గుర్తించారు. వారంరోజుల క్రితం దుబాయి నుంచి వచ్చిన ఓ యువకుడికి కరోనా లక్షణాలు కనిపించటంతో హైదరాబాద్‌ గాంధీ హాస్పిటల్ కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

జగిత్యాల మండలం గోపాల్‌రావుపేటకు చెందిన 23 ఏళ్ల యువకుడు ఉపాధి నిమిత్తం దుబాయ్ కి వెళ్లాడు. అయితే అతడు గతవారం అక్కడినుండి స్వదేశానికి తిరిగివచ్చాడు. అయితే అక్కడినుండి వచ్చినప్పటి నుండి తీవ్ర దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబసభ్యలు స్థానిక  ఆస్పత్రికి తరలించారు. విదేశాల నుండి రావడం, కరోనా లక్షణాలను కలిగి వుండటంతో అతన్ని గాంధీ హాస్పిటల్ తరలించి పరీక్షలు నిర్వహించాలని డాక్టర్లు సూచించారు. 

read more  ఢిల్లీలో మరో కేసు: దేశంలో 31 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు

కరోనా వ్యాధి తెలంగాణ రాష్ట్రంలో ప్రబలకుండా ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై ఇప్పటికే హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాధి నివారణ విషయంలో తీసుకొంటున్న చర్యలపై గురువారం హైకోర్టు విచారణ చేసింది. ప్రజలకు ఉచితంగా మందులను, మాస్క్‌లను పంపణీ చేస్తున్నామని హైకోర్టుకు అధికారులు వివరించారు. అయితే మురికివాడల్లో ప్రజలు చేతులు కడుక్కొనేందుకు మంచినీళ్లు సరఫరా చేస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది.

 అన్ని ప్రాంతాల్లో ఉచితంగా మందులు సరఫరా చేస్తున్నారా హైకోర్టు ప్రశ్నించింది.  రాష్ట్రంలోని జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసినట్టుగా వైద్యశాఖాధికారులు హైకోర్టుకు నివేదికను ఇచ్చారు. 

read more  మీడియా ఓవరాక్షన్.. కంగారుపడ్డ కరోనా అనుమానితుడు: హాస్పిటల్ నుంచి పరార్

ఈ కమిటీలో ఆయా ప్రాంతాల్లో కరోనా వ్యాధి ప్రబలకుండా  చర్యల గురించి  ఈ కమిటీ సూచనలు ఇవ్వనున్నాయని అధికారులు వివరించారు.బస్సు స్టేషన్లలో స్క్రీనింగ్ సౌకర్యం కల్పించాలని  హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలా ప్రభుత్వం కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా అనుమానిత కేసులు మాత్రం తగ్గడంలేదు. 
 

click me!