పేదల కూటిని దోచేస్తారా?

By narsimha lodeFirst Published Oct 13, 2019, 11:56 AM IST
Highlights

పేదల సోమ్ము  పరుల పాలవుతోంది. లబ్ధిదారులకు  అందాల్పిన బియ్యం పక్కదారి పడుతున్నాయి.  తాజాగా  తెలంగాణ రాష్టం నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ 
తరిలిస్తున్న బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కృష్ణాజిల్లా కంచికచర్ల వద్ద  తెలంగాణ రాష్ట్రం ఎర్రుపాలెం నుండి పశ్చిమ గోదావరి జిల్లాకు రేషన్ బియ్యం తరలి వెళ్తుందన్న సమాచారం అందుకున్న పోలీసులు మాటు వేసి లారీని పట్టుకున్నారు.

పక్కా సమాచారంతో పోలీసులు కంచికచర్ల పట్టణం జుజ్జూరు రోడ్డు పెట్రోల్ బంక్ సమీపంలో తెల్లవారుజామున ఏపీ 35 టి 6476 నెంబరు గల లారీ పట్టుకున్నారు. దానిలో 
సుమారు 19 టన్నుల రేషన్ బియ్యం తో పట్టుబడింది.  డ్రైవర్ తో సహా రేషన్ బియ్యం తరిలిస్తున్న వారిని పట్టుకుని కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు  వారిపై కేసు నమోదు చేసిన  దర్యాప్తు చేస్తున్నారు.

పేదలు కడుపు నిండా తిండి తినాలని తక్కువ ధరకే బియ్యాన్ని రేషన్ షాపుల  ద్వారా బియ్యాన్ని ప్రభుత్వం పేదలకు  సరఫరా చేస్తుంది. అయితే  కొందరు అక్రమార్కులు  
వాటిని కూడా విడిచి పెట్టకుండా  బ్లాక్ మార్కెట్‌లలో ఆమ్మి సోమ్ము చేసుకుంటున్నారు. 

click me!