హైకోర్టు సాధన ఉద్యమం ఉదృతం...కర్నూల్ ఎంపీ ఇంటి ముట్టడి

By Arun Kumar PFirst Published Oct 30, 2019, 4:55 PM IST
Highlights

హైకోర్టు సాధన ఉద్యమం కర్నూల్ లో ఉదృతంగా మారింది. తమ డిమాండ్ కు మద్దతివ్వాలంటూ స్థానిక విద్యార్థి, యువజన సంఘాలు కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంటిని ముట్టడించారు.  

కర్నూల్: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాకు చెందిన మేధావి, యువజన సంఘాలు ప్రజల్లో  చైతన్యం కల్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇలా ఓ వైపు హైకోర్టు సాధనకు ప్రజల మద్దతును కూడగడుతున్న యువజన సంఘాలు మరోవైపు రాజకీయ పార్టీలు, నాయకుల మద్దతును కూడా పొందుతున్నాయి. 

బుధవారం రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జాక్ ఆధ్వర్యంలో కర్నూలు ఎంపీ సంజీవకుమార్ ఇంటిని ముట్టడించారు. అభివృద్దిపరంగా వనుకబడిన  రాయలసీమలో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున విద్యార్థులు నినాదాలు చేశారు. 

తన ఇంటి వద్ద విద్యార్థి,యువజన సంఘాలు చేస్తున్న నిరసనకు ఎంపీ సంజీవకుమార్ మద్దతిచ్చారు. యువకులు చేస్తున్న ఈ ఉద్యమం న్యాయమైందని ఆయన పేర్కొన్నారు. గత నాయకులు తరతారలుగా రాయలసీమకు అన్యాయం చేశారని అన్నారు. 

read more హైకోర్టు సాధనపై రాయలసీమలో ఉద్యమం: కర్నూలులో నిరసన తెలిపిన ఉద్యమకారులు

 మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిని, హైకోర్టును ఒకే చోట పెట్టి రాయలసీమ కు అన్యాయం చేశారని అన్నారు. కేవలం అమరావతిలో రియల్ ఎస్టేట్ కోసమే నిర్మించారని ఆరోపించారు. 

అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాయలసీమలో రాజధాని కర్నూల్ లో హైకోర్టు సాధన కోసం  14ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సహచర ఎంపీలను ఒకేతాటిపైకి తెచ్చి ముఖ్యమంత్రిని  కలుస్తానని నిరసనకారులకు సంజీవ్ కుమార్ హామీ ఇచ్చారు.

read more  ఏపీ హైకోర్టు తరలింపు ప్రచారం: అమరావతిలో న్యాయవాదుల ఆందోళన

ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జాక్ నేతలు శ్రీరాములు, చంద్రప్ప, రామకృష్ణ, సీమకృష్ణ, శివ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇలా ప్రతి రాజకీయ నాయకుడిని హైకోర్టు సాధన కోసం కలవనున్నట్లు జాక్ సభ్యులు పేర్కొన్నారు.
   

click me!