ప్రతీ ఆర్జీకి పరిష్కారం చూపాలి: స్పందన కార్యక్రమంలో కలెక్టర్ వీరపాండియన్

By Siva KodatiFirst Published Oct 7, 2019, 6:29 PM IST
Highlights

చిన్న చిన్న కారణాల నెపంతో ఆర్జీలను వెనక్కి తిప్పి పంపించకుండా అర్జీదారునితో సంబందిత దరఖాస్తు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకొని పరిష్కరించేందుకు చొరవ చూపాలని వీరపాండియన్ సూచించారు

స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులు స్వయంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న చిన్న కారణాల నెపంతో ఆర్జీలను వెనక్కి తిప్పి పంపించకుండా అర్జీదారునితో సంబందిత దరఖాస్తు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకొని పరిష్కరించేందుకు చొరవ చూపాలని వీరపాండియన్ సూచించారు.

ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే క్షేత్ర స్తాయిలో విచారించి అర్జీదారునికి న్యాయం జరిగేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. అర్జీని తిప్పి పంపాల్సిన పరిస్థితే వస్తే సరైన కారణాలు వివరించి వెనక్కి పంపాలన్నారు.

వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను సంబందిత శాఖ అధికారులు సక్రమంగా వినియోగించుకొని ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

అన్ని శాఖల అధికారులు నుండి కేవలం ఈ-ఆఫీస్ ద్వారా వచ్చే దస్త్రాలన్నీ చూడటం జరుగుతుందని మాన్యువల్ గా వచ్చిన ఫైళ్ళను తిప్పి పంపుతామని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. అవసరమైతే మరోమారు ఈ-ఆఫీస్ కార్యకలాపలపై అధికారులకు, సిబ్బందికి శిక్షణను ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రవి పట్టన్ శెట్టి, జేసీ-2 ఖాజామొహిద్దిన్, డీఆర్వో వెంకటేశం, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు, డ్వామా పీడీ వెంకట సుబ్బయ్య, డీఎస్‌వో పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు

click me!