ఉచితంగానే కంటి ఆపరేషన్‌ చేపిస్తాం: నాని

By Arun Kumar PFirst Published Oct 10, 2019, 4:18 PM IST
Highlights

కృష్ణా జిల్లా విజయవాడ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. 

విజయవాడ : విజయవాడలోని సత్యనారాయణపురంలో అంద్ర నలంద మున్సిపల్‌ హైస్కూల్‌లో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’పథకాన్ని మంత్రి కొడాలి నాని గురువారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌ కంటి వెలుగు ద్వారా ప్రతి విద్యార్థికి కంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైతే విద్యార్థులకు కళ్లజోళ్లను కూడా అందిస్తామన్నారు. కంటి వెలుగు పరీక్షల్లో ఆపరేషన్‌లు అవసరమైనవారికి ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్‌ చేపిస్తుందని ప్రకటించారు. 

రాష్ట్రంలో ఎవరూ అవగాహన లోపంతో కంటి చూపును కోల్పోకూడదన్న ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రంలో ఆరు దశలలో వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం అమలవుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 5.40 కోట్ల ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తామని పునరుద్ఘాటించారు.

click me!