మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ 12 రోజుల తర్వాత అజ్ఞాతం వీడారు.ముందుగా చెప్పినట్టుగానే ఆయన దుగ్గిరాలలో బుధవారం నాడు ఇంటికి వచ్చారు.
ఏలూరు: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతం వీడారు. భార్య అనారోగ్యంగా ఉండడంతో చింతమనేని ప్రభాకర్ బుధవారం నాడు ఆయన తన స్వగ్రామం దుగ్గిరాలకు వచ్చారు. ఇంటివద్దే పోలీసులు చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు.
12 రోజుల క్రితం తమను చింతమనేని ప్రభాకర్ కులం పేరుతో దూషించారని కొందరు దళితులు ఆయనపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదైననాటి నుండి చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇవాళ అజ్ఞాతం వీడుతానని ముందుగానే మీడియాకు ప్రకటించారు. బుధవారం నాడు ఉదయం ఆయన అజ్ఞాతం వీడారు.
undefined
దుగ్గిరాలలోని తన ఇంటికి చేరుకొన్నారు. ఇంటికి వచ్చిన చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చింతమనేనిని అరెస్ట్ చేసే సమయంలో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. తోపులాట జరిగింది. చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేయకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకొన్నారు.
చింతమనేని ప్రభాకర్ పై 52 కేసులు ఉన్నాయి. చింతమనేని ప్రభాకర్ తన భార్య అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించేందుకు వెళ్లే సమయంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.ఈ సమయంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆసుపత్రిలో తన భార్యను పరామర్శించిన తర్వాత లొంగిపోతానని చెప్పినా కూడ పోలీసులు అరెస్ట్ చేయడంతో టీడీపీ కార్యకర్తలు అడ్డుకొన్నారు.
పోలీస్ వ్యాన్ నుండి చింతమనేని ప్రభాకర్ ను బలవంతంగా కిందకు దించారు. ఈ సమయంలో పోలీసులు అతి కష్టం మీద చింతమనేని ప్రభాకర్ ను వ్యాన్ లో ఎక్కించారు. జంగారెడ్డి గూడెం వైపుగా చింతమనేని ప్రభాకర్ ను తీసుకెళ్లారు. రహస్య ప్రాంతంలో చింతమనేని ప్రభాకర్ ను తీసుకెళ్లి విచారణ చేస్తున్నారని సమాచారం.
సంబంధిత వార్తలు
నేడు పోలీసుల ఎదుట లొంగిపోనున్న చింతమనేని ప్రభాకర్
రెచ్చగొట్టారు, నాది తప్పని నిరూపిస్తే... బొత్సకు చింతమనేని సవాల్
చింతమనేని కేసులో అలసత్వం: సీఐ సస్పెన్షన్, మరికొందరి పోలీసులపై వేటు..?
ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని ప్రభాకర్
అజ్ఞాతంలోకి మాజీ ఎమ్మెల్యే చింతమనేని
పోలవరం పైపులు చోరీ చేశాడు:చింతమనేనిపై పోలీసులకు ఫిర్యాదు
ఇసుక కొరతపై ఆందోళన... చింతమనేని గృహ నిర్భందం
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు