1989లో ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు: ఆత్మకూరులో ఆసలేం జరిగింది?

By telugu team  |  First Published Sep 11, 2019, 10:40 AM IST

గుంటూరు జిల్లాలోని ఆత్మకూరు ఫాక్షన్ గొడవలకు పేరు గాచించింది. ఆత్మకూరు గ్రామంలో ప్రజలు వైసిపి, టీడీపి మధ్య విడిపోయి దాడులకు పూనుకున్నారు. 1989లో ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. అప్పుడు ఎన్టీఆర్ గ్రామాన్ని సందర్శించారు. ఇప్పుడు చంద్రబాబు చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. 


గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చలో ఆత్మకూరుకు ఇచ్చిన పిలుపుతో అసలు అత్మకూరులో ఏం జరిగిందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. గుంటూరు జిల్లా దుర్గి మండలంలోని గ్రామం ఆత్మకూరు. తొలి నుంచి ఆ గ్రామం ఫాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. 

గ్రామ జనాభా దాదాపు 2700. ఇందులో ఎస్సీలు 600 మంది కాగా, ఇతురులు 2100 మంది ఉన్నారు. ఎస్సీలు టీడీపి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య వర్గాలుగా విడిపోయారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపి వర్గానికి చెందిన పేరువాల కొండలు తదితరులపై వైసిపి మద్దతుదారులు దాడి చేసి, వారిని తీవ్రంగా గాయపరిచారనే ఆరోపణలు ఉన్నాయి. 

Latest Videos

దాడులకు భయపడి 70 టీడీపి కుటుంబాలు గ్రామం విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇళ్లకు తాళాలు వేసి ఇతర గ్రామాల్లోని తమ బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే, ఇళ్ల తాళాలు పగులగొట్టి విధ్వంసం సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. గ్రామం విడిచిపెట్టిన బాధితులు దుర్గి, వెల్దుర్తి, మాచర్ల, కారంపూడి గ్రామాల్లో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. దానిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. 

ఆత్మకూరులోనే కాకుండా పల్నాడులోని పలు ప్రాంతాల్లో తమ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని టీడీపి నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో చంద్రబాబు బుధవారంనాడు చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో పోలీసులు బాధితులను గ్రామానికి రప్పించడానికి ప్రయత్నించినట్లు స్థానికంగా వార్తలు వస్తున్నాయి. చివరకు 10 మందిని గ్రామానికి రప్పించగలిగారని, వారు కూడా భార్యాపిల్లలతో కాకుండా ఒంటరిగానే వచ్చారనేది వార్తల సారాంశం. 

గ్రామానికి వచ్చినవారు కూడా తమ ఇళ్లకు వెళ్లడానికి నిరాకరించడంతో వారికి లూథరన్ చర్చిలో పునరావాసం కల్పించినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రామంలో దాదాపు 60 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. బుధవారంనాటికి మిగతా 60 కటుుంబాలను రప్పించి పూర్తిగా భద్రత కల్పిస్తామని చెప్పారు. 

ఆత్మకూరులో 1989లో ఫాక్షన్ పడగ విప్పింది. కాంగ్రెసు మద్దతుదారుల దాడిలో టీడీపి వర్గానికి చెందినవారు నష్టపోయారు. ప్రత్యర్థులు గృహదహనాలకు, ఆరాచకాలకు పాల్పడ్డారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆత్మకూరు సందర్సించి, బాధితులను ఓదార్చారు.

కాగా, ఫాక్షన్ గొడవలకు టీడీపి రాజకీయ రంగు పులుముతోందని వైసిపి ఆరోపిస్తోంది. టీడీపిని ప్రశ్నిస్తూ వైఎస్సార్ కాంగ్రెసు అధికారిక పత్రిక సాక్షిలో వార్తకథనాలు ప్రచురితమయ్యాయి. రెండు వర్గాల ఘర్షణకు టీడీపి రాజకీయ రంగు పులుముతోందని వార్తాకథనంలో వ్యాఖ్యానించారు పునరావాసానికి టీడీపిలోనే మద్దతు కరువైనట్లు వ్యాఖ్యానించింది. 

యరపతనేని, కోడెల శివప్రసాద రావు దురాగతాలను కప్పిపుచ్చే యత్నానికి టీడీపి పాల్పడినట్లు ఆరోపించింది. ఉద్యోగ నియమకాలు, సంక్షేమ పథకాలు అమలవుతున్న దశలో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు టీడీపి ప్రయత్నంలో భాగంగా కూడా ఆత్మకూరు వ్యవహారం ముందుకు వచ్చిందని వ్యాఖ్యానించింది. పల్నాట కపటనాటకం అంటూ మరో వార్తాకథనాన్ని కూడా సాక్షి దినపత్రికలో ప్రచురించారు. టీడీపి అరాచకాలంటూ కొన్ని ఉదంతాలను కూడా ఎత్తి చూపింది.

సంబంధిత వార్తలు

భూమా అఖిలప్రియ హౌస్ అరెస్టు: పోలీసులతో వాగ్వివాదం

చలో ఆత్మకూరు ఎఫెక్ట్: చంద్రబాబునాయుడు హౌజ్ అరెస్ట్, నిరహార దీక్ష

గుంటూరులో టెన్షన్: టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్

తాడోపేడో తేల్చుకుంటాం, వదిలిపెట్టను: జగన్ సర్కార్ పై చంద్రబాబు గరంగరం

వేడెక్కిన పల్నాడు: టీడీపీకి పోటీగా.. రేపు వైసీపీ చలో ఆత్మకూరు

click me!