కేసీఆర్ కు డిఎస్ సవాల్ ...మున్సిపోల్స్ కు ముందు హాట్ హాట్ కామెంట్స్

By Arun Kumar PFirst Published Jan 20, 2020, 10:09 PM IST
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్ కు  దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలని డి శ్రీనివాస్ సవాల్ విసిరారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొద్ది గంటలు ముందుగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.

నిజామాబాద్: రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న రాజ్యసభ సభ్యులు డి. శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎన్నో రోజులుగా సైలెంట్ గా ఉన్న డిఎస్ ఒక్కసారిగా నోరు విప్పడం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. కాంగ్రెస్ పార్టీని వీడి చారిత్రాత్మక తప్పిదం చేశానంటూనే ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారు. కెసిఆర్ కుటుంబం బాగుపడితే బంగారు తెలంగాణ అయినట్లేనా అంటూ ప్రశ్నలు సంధించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు  దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొద్ది గంటలు ముందుగానే డి. శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. నిజామాబాద్ లో అధికార పార్టీని ఎదుర్కునే వ్యూహంలో భాగంగానే డిఎస్ టిఆర్ఎస్ పై విమర్శలకు దిగారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

read more  

టిఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా  కొనసాగుతున్న డిఎస్ వ్యవహారంపై పార్టీ నేతలు చర్యలు తీసుకోవాలని ఏడాది క్రితం తీర్మానం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంచారు. దీనిపై ఇప్పటివరకు టిఆర్ఎస్  అధినేత ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డి శ్రీనివాస్ కూడా పార్టీకి దూరంగా ఉంటున్నా పార్టీ ధిక్కార స్వరాన్ని పెద్దగా వినిపించలేదు.  పార్టీ నిర్ణయాల మేరకే పార్లమెంట్లో కూడా నడుచుకున్నారు.దీంతో పార్టీకి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ నేతలతో  సత్సంబంధాలు ఉన్న విషయం బహిరంగ రహస్యమే. టిఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనా ఆయన తన రాజకీయ అనుభవం ముందు పార్టీ ధిక్కారనికి పాల్పడినట్టు ఆధారాలను అధికార పార్టీ ఇప్పటి వరకు సంపాదించలేక పోయింది. దీంతో డిఎస్ పై వేటు వేసేందుకు కూడా గులాబీ పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. 

read more  మల్లారెడ్డా మజాకా: ఆడియో టేపులపై కాంగ్రెస్ ఫిర్యాదు

పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నా  పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లయితే డి ఎస్ రాజ్యసభ సభ్యత్వానికి డోకా ఉండదని, పార్టీ ఫిరాయింపు కు పాల్పడి నట్లు గాని పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్లు అయితే తప్ప ఆయన పై ప్రభావం చూపించే అవకాశం లేదు.

click me!