డెంగ్యూ మరణాలు: డోన్ లో మూడో తరగతి విద్యార్థిని మృతి

By telugu teamFirst Published Nov 2, 2019, 12:07 PM IST
Highlights

కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో హేమలత అనే మూడో తరగతి విద్యార్థిని డెంగ్యూ విషజ్వరంతో మరణించింది. కామగాని గుంట్ల గ్రామానికే చెందిన విష్ణవి కూడా డెంగ్యూ వ్యాధితోనే గత నెల 31వ తేదీన చనిపోయింది.

కర్నూలు: కర్నూల్ జిల్లా డోన్ మండల పరిధిలోని కామగాని కుంట్ల గ్రామంలో  డెంగ్యూ విషజ్వరంతో చిన్నారి మృతి చెందింది. మూడో తరగతి చదువుతున్న హేమలత అనే విద్యార్థిని శనివారంనాడు కర్నూలు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచింది.

డెంగ్యూ విషజ్వరంతో చిన్నారి  మరణించడం వల్ల గ్రామంలో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.హెల్త్ ఎమర్జెన్సీ నిర్వహించి, గ్రామంలో ఉన్నటువంటి చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు.

Also Read: డెంగీ జ్వరంతో పెళ్లి కూతురు మృతి... కుటుంబంలో విషాదం

దీనికి వైద్యుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సుంకయ్య ఆరోపించారు. ఇదే మండల పరిధిలోని కామగాని కుంట్ల గ్రామంలో నిన్న ఒకరు, ఈ రోజు ఒకరు డెంగ్యూ విషజ్వరంతో చనిపోయారని గుర్తు చేశారు.

అదే గ్రామానికి చెందిన వైష్ణవి గత నెల 31వ తేదీన డెంగ్యూతో మరణించింది. ఇది మరువకముందే శనివారం కర్నూల్ హాస్పిటల్లో హేమలత మూడవ తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఒకే గ్రామంలో ఇద్దరు డెంగ్యూ విషజ్వరాలతో మరణించడం వల్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

click me!