బంగ్లా చెరలో విశాఖ మత్స్యకారులు... కేంద్ర మంత్రి సాయం కోరిన ఎంవీవీ

By Arun Kumar PFirst Published Oct 22, 2019, 3:53 PM IST
Highlights

ఇటీవల వేటకు వెళ్ళి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకు చిక్కిన ఎనిమిదిమంతి విశాఖ మత్స్యకారులను కాపాడేందుకు ఎంపి ఎంవివి సత్యనారాయణ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇవాళ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ వ్యక్తిగత కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.  

విశాఖపట్నం: బంగ్లాదేశ్ లో కోస్ట్ గార్డ్ లకు చిక్కిన విశాఖపట్నానికి చెందిన మత్స్య కారులను కాపాడాలంటూ వైఎస్సార్‌సిపి ఎంపీ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశీవ్యవహారాల శాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శికి ఎంపీ ఎంవీవీ వినతిపత్రం సమర్పించారు. వారిని వెంటనే విడిపించి మత్స్యకార కుటుంబాలను కాపాడాలంటూ కోరారు.

Read more ప్రత్యేక హోదా ఎందుకు అవసరమంటే...: అమిత్ షాకు జగన్ వివరణ ...

ఇవాళ(మంగళవారం) న్యూఢిల్లీ వెళ్లిన ఆయన నేరుగా విదేశీ వ్యవహారాల శాఖామంత్రి వ్యక్తిగత కార్యదర్శి  జై శంకర్ ని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.అనంతరం ఎంవీవీ మాట్లాడుతూ...మత్స్యకారులను కాపాడేందుకు అవసరమైతే బంగ్లాదేశ్ కు కూడా వెళతామన్నారు. అక్కడికి వెళ్లి కోస్ట్ గార్డ్ అధీనంలో ఉన్న మత్స్య కారులను విడిపిస్తానని ఆయన పేర్కొన్నారు.

దురదృష్టవశాత్తు మత్స్యకారులు బంగ్లాదేశ్ సరిహద్దులో వేటకు వెళ్లి అక్కడి అధికారులకు చిక్కారని తెలిపారు. ఇలా పట్టుబడిన వారిని తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.


  
ఈ విషయంపై గతంలో పలు మార్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపామన్నారు. ఈ క్రమంలో మరింత చొరవచూపి వారిని ,సాధ్యమైనంత త్వరగా భారతదేశం రప్పించాలని కోరామన్నారు.  దీనిపై తాము వినతిపత్రం ఇవ్వగా జై శంకర్ సానుకూలంగా స్పందించారన్నారు.

తాజాగా కేంద్ర మంత్రి కార్యదర్శిని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ మత్స్యకార యువజన సమైఖ్య రాష్ట్ర అధ్యక్షులు వాసుపల్లి జానకిరామ్, డొమెస్టిక్ ట్రెడిషనల్ ఫిష్ వర్క్ ఫోరమ్ నాయకులు డి.పాల్, బోట్ యజమాని వాసుపల్లి రాము తదితరులు ఉన్నారు.

 

click me!