వరల్డ్ కప్ 2019: టీమిండియాలో సగానికి పైగా కొత్తముఖాలే...సెలెక్టర్ల వ్యూహమిదేనా?

By Arun Kumar PFirst Published Apr 15, 2019, 8:45 PM IST
Highlights

వరల్డ్ కప్... ప్రతి ఆటగాడు తన కెరీర్లో ఒక్కసారైనా ఆడాలనుకునే మెగా క్రికెట్ టోర్నీ. అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్ని మార్పులు వచ్చినా...టీ20 వంటి ధనాధన్ క్రికెట్ విభాగాలు వచ్చి సాంప్రదాయ క్రికెట్ కు అభిమానులు దూరమవుతున్నా ఈ ప్రపంచ కప్ సమరానికి మాత్రం ఆదరణ తగ్గడంలేదు. అంతేకాదు ఈ క్రికెటర్లు కూడా ఒక్కసారైనా ప్రపంచ కప్ ని తమ దేశానికి అందించిన జట్టులో వుండాలని అనుకుంటారు. కానీ అనుభవజ్ఞులైన సీనియర్ ప్లేయర్లకే ఆ అవకాశం వస్తుంది. కాని 2019 ప్రపంచ కప్ లో తలపడే భారత జట్టులో మాత్రం సగానికి పైగా ఆటగాళ్లు మొదటిసారి వరల్డ్ కప్ ఆడుతున్న యువ ఆటగాళ్లే కావడం విశేషం.
 
శుక్రవారం ముంబైలోని బిసిసిఐ కార్యాలయంలో  టీమిండియా సెలెక్షన్ కమిటీతో పాటు ప్రధాన కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంయ కప్ టీంపై తుది కసరత్తు చేశారు. అనంతరం ఈ మెగా టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లను ప్రకటించారు. అయితే టీమిండియా ఆటగాళ్ల ఎంపిక విషయంలో సెలక్టర్లు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు జట్టు  కూర్పును బట్టి అర్థమవుతోంది. 

ప్రపంచ కప్ జట్టులో చాలామంది యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. వీరంతా మొదటిసారి వరల్డ్ కప్ ఆడుతున్నావారే. మొత్తం 15మందితో కూడిన జట్టును ప్రకటించగా అందులో 7మంది మొదటిసారి ప్రపంచ  కప్ జట్టులో స్థానం సంపాదించారు. ఇలా సగానికి పైగా గత వరల్డ్ కప్ లో ఆడిన వారు కాకుండా కొత్తవారికే బిసిసిఐ అవకాశం ఇచ్చింది. 

ఇలా తొలి వరల్డ్ కప్ ఆడుతున్న ఆటగాళ్లలో విజయ్‌ శంకర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, కేదార్‌ జాదవ్‌, కుల్దీప్‌ యాదవ్‌, యజువేందర్ చాహల్‌, జస్ప్రీత్ సింగ్ బుమ్రాలు ఉన్నారు. ఇలా వీరంతా టీమిండియా తరపున ప్రపంచ కప్ ను ఆడాలన్ని కలను నిజం చేసుకున్నారు. అలాగే 2007 వరల్డ్ కప్ లో జట్టులో ఆడిన దినేశ్ కార్తిక్ కు తాజాగా మరో ప్రపంచకప్ ఆడే అవకాశం వచ్చింది. 
  
ఇక గత వరల్డ్ కప్ టోర్నీలో ఆడిన విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, ఎంఎస్‌ ధోని, శిఖర్‌ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జడేజా, షమీలు ఈసారి కూడా ఈ జట్టులో కూడా చోటు దక్కింది.  అయితే ఇలా యువ ఆటగాళ్లు, అనుభవమున్న ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేయడం సెలక్షన్ కమిటీ వ్యూహంగా కనిపిస్తోంది. యువ ఆటగాళ్ల మెరుగైన ఆటతీరుకు సీనియర్ల అనుభవం తోడైతే టీమిండియా విజయానికి డోకా వుండదన్నది  సెలెక్టర్ల వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఎప్పుడూ లేని విధంగా కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చి వుంటారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

రాయుడిని సెలెక్టర్లెవ్వరూ వ్యతిరేకించలేదు...అయినా ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే...: చీఫ్ సెలెక్టర్

ప్రపంచ కప్ 2019: నాలుగో స్థానంపై క్లారిటీ ఇచ్చిన బిసిసిఐ

ప్రపంచ కప్ 2019: భారత జట్టు ఎంపికలో గవాస్కర్ అంచనాలు తలకిందులు

వరల్డ్ కప్ జట్టులో రిషబ్‌కు ఎందుకు స్థానం దక్కలేదంటే..: చీఫ్ సెలెక్టర్

ప్రపంచకప్‌ 2019: భారత జట్టిదే, రాయుడికి మొండిచేయి

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. జూన్ 16న పాక్‌తో భారత్ ఢీ

click me!