ప్రపంచ కప్ 2019: నాలుగో స్థానంపై క్లారిటీ ఇచ్చిన బిసిసిఐ

By Arun Kumar PFirst Published Apr 15, 2019, 5:57 PM IST
Highlights

ప్రపంచ దేశాల మధ్య జరిగే క్రికెట్ సమరానికి భారత జట్టు సిద్దమయ్యింది. కొద్దిసేపటి క్రితమే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనే టీమిండియా జట్టును బిసిసిఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆటగాళ్ల ఎంపికలో సమతూకాన్ని పాటించిన సెలక్షన్ కమిటీ కోహ్లీ సేనకు సమస్యగా మారిన నాలుగో స్థానంపై క్లారిటీ ఇచ్చింది. ఈ స్థానంలో బ్యాటింగ్ కు దిగే ఆటగాళ్ల విషయంలో గతకొన్నిరోజులుగా పలు ఊహాగానాలు వినిపించగా వాటన్నింటిన పటాపంచలు చేశారు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. జట్టు కూర్పును బట్టి చూస్తే నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగే ఆటగాడెవరో మనకు అర్థమవుతుంది. 

ప్రపంచ కప్ కోసం బిసిసిఐ ప్రకటించిన జట్టును ఓసారి పరిశీలిస్తే...నాలుగో స్థానంలో తమిళ నాడు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడు మూడు రకాలుగా జట్టుకు ఉపయోగపడతాడనే ప్రపంచ కప్ జట్టులో ఎంపిక చేసినట్లు ఎమ్మెస్కే వెల్లడించారు. అతడు ఆల్ రౌండర్‌గా, స్పెషలిస్ట్ బ్యాట్ మెన్, బౌలర్ కు ఉపయోగపతాడని తెలిపారు. 

టీమిండియా ఇన్నింగ్స్ ను ఎప్పటిలాగే ప్రపంచ కప్ లో కూడా ఓపెనర్లు రోహిత్, శిఖర్ ధావన్ లు ప్రారంభిస్తారు. వీరిలో ఎవరైనా జట్టుకు దూరమైన సమయంలో కేఎల్ రాహుల్ వారి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఇక ఫస్ట్ డౌన్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు దిగుతారు. అయితే  ఆ తర్వాతి స్థానాన్ని విజయ్ శంకర్ బరిలోకి దిగే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. బిసిసిఐ ప్రకటించిన భారత జట్టులో  ఈ స్థానాన్ని భర్తీచేసే అవకాశాలున్న ఆటగాడు అతడొక్కడికే కనిపిస్తున్నాయి. 

ఇప్పటికే ఈ స్థానం కోసం పోటీ పడిన రిషబ్ పంత్, అంబటి రాయుడు అసలు ప్రపంచ కప్ జట్టులోనే లేకుండా పోయారు. ఇక దినేశ్ కార్తిక్ ను సెకండ్ వికెట్ కీపర్ గా మాత్రమే పరిగణలోకి తీసుకుని కేవలం ధోని జట్టుకు దూరమైన సమయంలోనే అతడి సేవలను వినియోగించుకోనున్నట్లు సెలెక్టర్లు తెలిపారు. ఇక  ఎంఎస్ ధోని, పాండ్యా, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజాలు ఈ నాలుగో స్థానంలో ఎప్పుడు బరిలోకి దిగిన సందర్భాలు లేవు. కాబట్టి టీమిండియా వద్ద వున్న ఏకైక ఆప్షన్ గా విజయ్ శంకర్ కనిపిస్తున్నాడు. 

ఇక నాలుగో స్థానంలో కోహ్లీ కూడా బరిలోకి దిగే అవకాశాలున్నా టీమిండియా మేనేజ్ మెంట్ అంత సాహసం చేయదని చెప్పాలి. ఫస్ట్ డౌన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసే కోహ్లీని నాలుగో స్ధానంలో ఆడించే ప్రయోగాని ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో చేసే అవకాశమే లేదు. క్రికెట్ విశ్లేషకులు, మాజీలు, అభిమానులు ఇది మంచిది కాదనే అభిప్రాయంతో వున్నారు. కాబట్టి ప్రయోగాలేవి చేయకుంటే విజయ్ శంకర్ నాలుగో స్ధానంలో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

రాయుడిని సెలెక్టర్లెవ్వరూ వ్యతిరేకించలేదు...అయినా ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే...: చీఫ్ సెలెక్టర్

 ప్రపంచ కప్ 2019: భారత జట్టు ఎంపికలో గవాస్కర్ అంచనాలు తలకిందులు

వరల్డ్ కప్ జట్టులో రిషబ్‌కు ఎందుకు స్థానం దక్కలేదంటే..: చీఫ్ సెలెక్టర్

ప్రపంచకప్‌ 2019: భారత జట్టిదే, రాయుడికి మొండిచేయి

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. జూన్ 16న పాక్‌తో భారత్ ఢీ

click me!