తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు అర్థాంతరంగా తన కెరీర్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. దీంతో రాాయుడు రిటైర్మెంట్ కు సెలెక్షన్ కమిటీ ముఖ్యంగా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కారణమంటూ అభిమానులు ఆరోపిస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చుకున్నాడు.
అంబటి రాయుడు... చాలా కాలం తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్న తెలుగు ఆటగాడు. అయితే అద్భుతమైన ఫామ్ ప్రతిభ తోడవడంతో ప్రపంచ కప్ కు ముందు అతడాడిన అన్ని మ్యాచుల్లోనూ అదరగొట్టాడు. ఇలా అన్ని రకాలుగా ప్రపంచ కప్ ఆడాల్సిన అర్హతను సాధించిన రాయుడికి టీమిండియా సెలెక్షన్ కమిటీ షాకిచ్చింది. ఒక్కసారి కాదు రెండు సార్లు తిరస్కరించి ఏకంగా అతడు క్రికెట్ కు గుడ్ బై చెప్పే వరకు వదల్లేదు. ఇలా పక్షపాతంగా వ్యవహరించిన సెలెక్షన్ కమిటీ ముఖ్యంగా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాయుడు ఈ స్థాయిలో వుండటానికి మేమే కారణం; ఎమ్మెస్కే
ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే ప్రసాద్ తాజాగా రాయుడు వ్యవహారంపై స్పందించాడు. అంబటి రాయుడంటే తమకేమీ వ్యక్తిగత ద్వేషం లేదని పేర్కొన్నాడు. అలా తాము పక్షపాతంగా వ్యవహరించి వుంటే ప్రపంచ కప్ కు ముందు కూడా అతడికి అవకాశాలిచ్చే వారిమి కాదన్నాడు. గత ఐపిఎల్(2018) లో అతడు అద్భుతంగా రాణించడం వల్లే ఆ తర్వాత జరిగిన సీరీసుల్లో అతడిని ఎంపిక చేశామన్నాడు. ఆ సమయంలో రాయుడిని ఎంపిక చేయడంతో మాపై అనేక విమర్శలు వచ్చాయని...అయినా కూడా అతన్ని కొనసాగించామని ఎమ్మెస్కే పేర్కొన్నాడు.
ఇక ఆటగాళ్ల ఫిట్ నెస్ పరీక్షల్లో భాగంగా నిర్వహించే యోయో టెస్టులో రాయుడు ఫెయిలైనపుడు అతడికి అండగా నిలబడ్డాం. నెల రోజుల పాటు అతడికిఅవకాశమిచ్చి ప్రత్యేకంగా ఫిట్ నెస్ ప్రోగ్రాం నిర్వహించాం. దీని ఫలితంగానే అతడు తర్వాత జరిగిన ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లగలిగాడని ప్రసాద్ వివరించాడు.
రాయుడిని ఎందుకు ఎంపిక చేయలేదంటే
ఇక ప్రపంచ కప్ జట్టులో అతన్ని ఎందుకు చేయలేకపోయామో గతంలోనే తాను వెల్లడించానని అన్నారు. విజయ్ శంకర్ గాయపడిన తర్వాత కూడా జట్టు అవసరాన్ని బట్టే మయాంక్ అగర్వాల్ ను ఎంపికచేశాల్సి వచ్చిందన్నాడు. తమకు మరో బ్యాకర్ ఓపెనర్ అవసరమన్న టీమిండియా అభ్యర్థనను అనుసరించే మయాంక్ ను ఎంపిక చేశామని ఇందులో తమ వ్యక్తిగత నిర్ణయాలేమీ లేవన్నాడు.
రిషబ్ పంత్ విషయంలో జరిగిందిదే
అంతకు ముందు శిఖర్ ధవన్ గాయపడి టోర్నీకిదూరమైనపుడు కూడా ఎడమచేతి వాటం బ్యాట్ మెన్ కావాలని భారత జట్టు కోరింది. దీంతో రిషబ్ పంత్ ను ఎంపికచేశామని తెలిపాడు. ఇలా జట్టు అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకున్న తమపై విమర్శలకు దిగడం ఇప్పటికైనా ఆపాలంటూ ఎమ్మెస్కే సూచించాడు.
మరిన్ని వార్తలు
అంబటి రాయుడి నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోకండి: ఎమ్మెస్కే కు వీహెచ్ లేఖ
అంబటి రాయుడు వేస్ట్, ఎన్ని చాన్స్ లిచ్చినా...: సంజయ్ జగ్దాల్
అంబటి రాయుడు రిటైర్మెంట్....బిసిసిఐకి భావోద్వేగంతో కూడిన లేఖ
అంబటి రాయుడు రిటైర్మెంట్... ఆవేదనతో సెహ్వాగ్ ట్వీట్
అంబటి రాయుడు రిటైర్మెంట్...టీమిండియా సెలెక్టర్లపై గంభీర్ సెటైర్లు
తీవ్ర అసంతృప్తి: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై