T20 worldcup 2021: విండీస్ చెత్త బ్యాటింగ్... ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 55 పరుగులకే ఆలౌట్...

Published : Oct 23, 2021, 08:44 PM ISTUpdated : Oct 23, 2021, 09:02 PM IST
T20 worldcup 2021: విండీస్ చెత్త బ్యాటింగ్... ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 55 పరుగులకే ఆలౌట్...

సారాంశం

T20 worldcup 2021: మొదటి మ్యాచ్‌లో చేతులెత్తేసిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్... ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 55 పరుగులకే ఆలౌట్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ  టైటిల్ ఫెవరెట్లుగా బరిలో దిగిన వెస్టిండీస్ జట్టు, తొలి మ్యాచ్‌లోనే తేలిపోయింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో విండీస్ జట్టు... 14.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది...
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన విండీస్‌ను ఇంగ్లాండ్ బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు. ముఖ్యంగా స్లో పిచ్ మీద బ్యాటింగ్‌కి వచ్చిన ప్రతీ విండీస్ బ్యాట్స్‌మెన్ భారీ షాట్లు కొట్టాలని ప్రయత్నించడంతో ఇంగ్లాండ్ బౌలర్లకు వికెట్లు తీయడం పెద్ద కష్టమేమీ కాలేదు.

6 పరుగులు చేసిన ఇవిన్ లూయిస్‌ను క్రిస్ వోక్స్ అవుట్ చేయగా, సిమ్మన్స్ 7 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి మొయిన్ ఆలీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 9 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది వెస్టిండీస్..

మొయిన్ ఆలీ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన సిమ్రన్ హెట్మయర్... మరో భారీ షాట్‌కి ప్రయత్నించి మోర్గాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  13 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన క్రిస్ గేల్, తైమల్ మిల్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

Must READ: T20 worldcup 2021: టీమిండియాతో మ్యాచ్... 12 మందితో కూడిన జట్టును ప్రకటించిన పాకిస్తాన్...

బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన డ్వేన్ బ్రావో 5 పరుగులు, నికోలస్ పూరన్ 9 బంతుల్లో 1 పరుగు చేసి పెవిలియన్ చేరగా డేంజరస్ మ్యాన్ ఆండ్రే రస్సెల్‌ను అదిల్ రషీద్ డకౌట్ చేశాడు... పోలార్డ్ 6 పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్‌లో అవుట్ కాగా, ఆ తర్వాతి బంతికే మెక్‌కాయ్ కూడా అవుట్ అయ్యాడు. 

అర్జున్ రాంపాల్‌ను బౌల్డ్ చేసిన అదిల్ రషీద్, విండీస్ కథను ముగించాడు. భారీ హిట్టర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు ఉన్న వెస్టిండీస్‌ జట్టులో క్రిస్ గేల్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు.

READ also: హీరోయిన్ స్నేహా ఉల్లాల్‌తో విండీస్ క్రికెటర్ క్రిస్‌ గేల్... టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి రెండ్రోజుల ముందు...

టీ20 చరిత్రలో వెస్టిండీస్‌కి ఇది రెండో అత్యల్ప స్కోరు. ఇంతకుముందు ఇంగ్లాండ్‌పైనే 2019లో 45 పరుగులకి ఆలౌట్ అయ్యింది వెస్టిండీస్.. అదిల్ రషీద్ 2 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి, టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. 

ఇవీ చదవండి: T20 worldcup 2021: మెంటర్ చేసేదేమీ లేదు, చేయాల్సిందంతా ప్లేయర్లే... సునీల్ గవాస్కర్ కామెంట్...

పాకిస్తాన్‌లో కోహ్లీ కంటే అతనికే ఫాలోయింగ్ ఎక్కువ... ఇక్కడ అందరూ ‘ఇండియాకా ఇంజమామ్’ అని...

వెల్‌కం బ్యాక్ ధోనీ... మాహీ రిటైర్మెంట్ తర్వాత మ్యాచులు చూడడం మానేసిన పాకిస్తానీ బషీర్ చాచా...

T20 worldcup 2021: ధోనీని మెంటర్‌గా తీసుకొచ్చింది అతనే... కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని...

 ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు... చితక్కొట్టుడు అంతే ఇదేనేమో... ఆస్ట్రేలియా బ్యాటర్ రికార్డు...

T20 worldcup 2021: మ్యాచ్ అవసరమా, మాకు వాకోవర్ ఇచ్చేయండి... షోయబ్ అక్తర్‌కి హర్భజన్ సింగ్ చురక...

T20 worldcup 2021: అతన్ని తీసుకోవడానికి ధోనీయే కారణం... కోహ్లీ, శాస్త్రిలను ఒప్పించి మరీ...

 

 

PREV
click me!

Recommended Stories

IND vs NZ : కోహ్లీ, గిల్ విధ్వంసం.. కేఎల్ రాహుల్ మాస్ ఫినిషింగ్
Rohit Sharma : ఊచకోత అంటే ఇదే.. రోహిత్ దెబ్బకు రికార్డులు అబ్బో !