T20 worldcup 2021: లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం...ఆఖరి ఓవర్‌లో...

Published : Oct 23, 2021, 07:02 PM ISTUpdated : Oct 23, 2021, 07:24 PM IST
T20 worldcup 2021:  లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం...ఆఖరి ఓవర్‌లో...

సారాంశం

t20 worldcup 2021: ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా... 

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. 119 పరుగల ఈజీ టార్గెట్ అయినా ఆఖరి ఓవర్ వరకూ సాగిన థ్రిల్లర్‌లో ఐదు వికెట్ల తేడాతో ఆసీస్ విజయాన్ని అందుకుంది.  119 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియాకి శుభారంభం దక్కలేదు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 5 బంతుల్లో పరుగులేమీ చేయకుండా డకౌట్ అయ్యాడు. 2009 టీ20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌పై రికీ పాంటింగ్ డకౌట్ తర్వాత పొట్టి ప్రపంచకప్‌లో డకౌట్ అయిన ఆసీస్ కెప్టెన్‌గా నిలిచాడు ఆరోన్ ఫించ్...

పెద్దగా ఫామ్‌లో లేని డేవిడ్ వార్నర్ 15 బంతుల్లో 3 ఫోర్లతో 14 పరుగులు చేసి రబాడా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 17 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసిన మిచెల్ మార్ష్... కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.. 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా...

Must READ: T20 worldcup 2021: టీమిండియాతో మ్యాచ్... 12 మందితో కూడిన జట్టును ప్రకటించిన పాకిస్తాన్...

అయితే స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కలిసి నాలుగో వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యం జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. 34 బంతుల్లో 3 ఫోర్లతో 35 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, నోకియా బౌలింగ్‌లో మార్క్‌రమ్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 21 బంతుల్లో ఓ ఫోర్‌తో 18 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా రివర్స్ స్వీప్‌కి ప్రయత్నించి, షంసీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు...
81 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా...

READ also: హీరోయిన్ స్నేహా ఉల్లాల్‌తో విండీస్ క్రికెటర్ క్రిస్‌ గేల్... టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి రెండ్రోజుల ముందు...

మ్యాక్స్‌వెల్ వికెట్‌తో టీ20ల్లో 50 వికెట్లు పూర్తిచేసుకున్నాడు ఐసీసీ టీ20 నెం.1 బౌలర్ షంసీ.  మ్యాక్స్‌వెల్ అవుటైన తర్వాత స్టోయినిస్, మాథ్యూ వేస్ కలిసి పోరాడారు. 24 బంతుల్లో 36 పరుగులు కావాల్సిన దశలో రబాడా వేసిన 17వ ఓవర్‌లో 11 పరుగులు రాబట్టాడు మాథ్యూ వేడ్. ఆ తర్వాత పెట్రోరియస్ వేసిన 18వ ఓవర్‌లో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. నోకియా వేసిన 19వ ఓవర్‌లో స్టోయినిస్ ఫోర్ బాదడంతో 10 పరుగులు వచ్చాయి...

ఆఖరి 6 బంతుల్లో 8 పరుగులు కావాల్సిన స్థితిలో మొదటి బంతికి 2 పరుగులు వచ్చాయి. తర్వాతి బౌండరీ రావడంతో సీన్ పూర్తి ఆసీస్‌వైపు మళ్లింది. స్టోయినిస్ 16 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు, మాథ్యూ వేడ్ 10 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు... మూడు వికెట్లు తీసిన జోష్ హజల్‌వుడ్‌, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు.

ఇవీ చదవండి: 

పాకిస్తాన్‌లో కోహ్లీ కంటే అతనికే ఫాలోయింగ్ ఎక్కువ... ఇక్కడ అందరూ ‘ఇండియాకా ఇంజమామ్’ అని...

వెల్‌కం బ్యాక్ ధోనీ... మాహీ రిటైర్మెంట్ తర్వాత మ్యాచులు చూడడం మానేసిన పాకిస్తానీ బషీర్ చాచా...

T20 worldcup 2021: ధోనీని మెంటర్‌గా తీసుకొచ్చింది అతనే... కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని...

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు