IPL 2024: కొత్త సీజ‌న్.. కొత్త రోల్.. ! చెన్నై ఓపెన‌ర్ గా ఎంఎస్ ధోని.. !

By Mahesh Rajamoni  |  First Published Mar 5, 2024, 9:53 AM IST

MS Dhoni: మార్చి 22 నుంచి ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) ప్రారంభం కానుంది. మ‌రోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచేందుకు చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే) క‌స‌రత్తులు మొద‌లుపెట్టింది. ఈ క్ర‌మంలోనే చెన్నై స్టార్ ప్లేయ‌ర్ ఎంఎస్ ధోని చేసిన‌ పోస్టు వైర‌ల్ గా మారింది. 
 


IPL 2024 - MS Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ (ఐపీఎల్ 2024) కు స‌ర్వం సిద్ధ‌మైంది. క్రికెట్ ప్రపంచం ఎంతో ఆస‌క్తి ఎదురుచూస్తున్న స‌మ‌యం వ‌చ్చేస్తోంది. ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్, భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తో తలపడనుంది. తొలి మ్యాచ్ మార్చి 22న సాయంత్రం 6.30 గంటలకు చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. మ‌రోసారి ఐపీఎల్ టైటిల్ ను గెల‌వాల‌ని చైన్నై సూప‌ర్ కింగ్స్ బ‌రిలోకి దిగుతోంది.

అయితే, ఎంఎస్ ధోనికి సంబంధించిన ప్ర‌తి విష‌యం ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే ధోని చేసిన ఒక పోస్టు క్రికెట్ వ‌ర‌ల్డ్ లో తెగ ఆస‌క్తిని రేకెత్తించింది. కొత్త సీజన్.. కొత్త పాత్ర కోసం వేచి ఉండలేనని ధోనీ చెప్పాడు. కొత్త పాత్ర ఏమిటో తెలియాలంటే వేచి ఉండండి అంటూ చేసిన ధోని పోస్టు దేనికి సంబంధించి ఉంటుంద‌నే చ‌ర్చ సాగుతోంది. కొత్త పాత్ర ఏమిటని అభిమానులు ఆరా తీస్తున్నారు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటారా? అని కొంతమంది అభిమానులు ఆందోళనలు వ్య‌క్తం చేస్తున్నారు.

Latest Videos

ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన భార‌త క్రికెట‌ర్లు వీరే..

ఇదే స‌మ‌యంలో మ‌రికొంత‌మంది అభిమానులు ధోనీ ఓపెనర్‌గా ఆడతాడని కామెంట్లు చేస్తున్నారు. దీంతో ధోని పోస్టు నెట్టింట బ‌జ్ క్రియేట్ చేసింది. డెవాన్ కాన్వేకు గాయం కార‌ణంగా ఐపీఎల్ కు దూరం కావ‌చ్చని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో య ధోనీ ఓపెనర్ అవుతాడని అభిమానులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా అది ఏమిటో తెలుసుకోవాలని క్రికెట్ ప్రపంచం ఉవ్విళ్లూరుతోంది. ధోనీ ఫేస్‌బుక్ పోస్ట్ ఇదే.. 

 

కాగా, ఇండియాన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో చెన్నై ఓపెనింగ్‌ మ్యాచ్‌ ఆడడం ఇది తొమ్మిదోసారి. ఐపీఎల్ 2024కు సీజ‌న్ కు సంబంధించి ఇప్ప‌టికే తొలి 21 మ్యాచ్‌లు షెడ్యూల్ విడుదల అయింది. లోక్ స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మిగ‌తా షెడ్యూల్ ను త్వ‌ర‌లోనే ప్ర‌కటిస్తామ‌ని ఐపీఎల్ నిర్వాహ‌కులు పేర్కొన్నారు. లోక్ స‌భ ఎన్నికల నోటిఫికేష‌న్ వ‌చ్చిన త‌ర్వాత ఐపీఎల్ మిగ‌తా స‌గం షెడ్యూల్ ను విడుద‌ల చేస్తామ‌నీ, ప్ర‌భుత్వంతో స‌మ‌న్వ‌యం చేసుకుని వేదికల ఎంపిక జ‌రుగుతుంద‌ని తెలిపారు.

T20 World Cup 2024: టీమిండియా పై బిగ్ అప్డేట్.. వివ‌రాలు ఇవిగో..

click me!