WPL 2024: యూపీ వారియర్స్ దూకుడుకు బ్రేక్.. 23 పరుగుల తేడాతో బెంగళూరు విజయం

By Rajesh Karampoori  |  First Published Mar 5, 2024, 1:32 AM IST

WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ 11వ మ్యాచ్‌లో RCB విజయం సాధించింది. మంధాన జట్టు 23 పరుగుల తేడాతో యూపీని ఓడించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.


WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ 11వ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో యూపీ వారియర్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. యూపీని 23 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో మంధాన జట్టు ముందడుగు వేసింది. టాస్ గెలిచిన యూపీ తొలుత ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

మంధాన, పెర్రీల అర్ధ సెంచరీల ఆధారంగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 175 పరుగులు చేయగలిగింది. ఇలా హ్యాట్రిక్‌పై కన్నేసిన ఆ జట్టును 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Latest Videos

 లక్ష్యచేధనకు వచ్చిన యూపీ వారియర్స్ కు శుభారంభం దక్కలేదు. ఈ జట్టులో  కెప్టెన్ అలిస్సా హేలీ,  హేలీ 38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు సహాయంతో 55 పరుగులు, దీప్తి శర్మ (33), పూనమ్‌ (31)లు తప్ప   మిగతావారు విఫలం కావడంతో ఆ జట్టు పోరాడి ఓడిపోయింది.  . హేలీ తొలి వికెట్‌కు కిరణ్ నవ్‌గిరేతో కలిసి 26 బంతుల్లో 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన చమరి అటపట్టు ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగింది. హారిస్ ఐదు పరుగులు, సెహ్రావత్ ఒక పరుగుకే వెనుదిగిరిగారు. ఈ తరుణంలో దీప్తి శర్మ, పూనమ్ ఖేమ్నార్ లు 31 బంతుల్లో 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ తరుణంలో దీప్తి 22 బంతుల్లో 33 పరుగులు చేయగా, పూనమ్ 24 బంతుల్లో 31 పరుగులు చేసింది. సోఫీ ఎక్లెస్టోన్ 4 పరుగులు మాత్రమే చేయగలిగింది. అదే సమయంలో అంజలి సర్వాణి మూడు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆర్‌సీబీ తరఫున సోఫీ డివైన్, సోఫీ మోలినిక్స్, జార్జియా వేర్‌హామ్, ఆశా శోభన తలో రెండు వికెట్లు తీశారు.

మంధాన, పెర్రీ అర్ధ సెంచరీలు  

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు దంచికొట్టింది. యూపీపై 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌.మేఘన, స్మృతి మంధాన జట్టుకు శుభ ఆరంభాన్ని అందించారు. సబ్బినేని మేఘన (28), మంధాన తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించారు. మేఘన ఔట్‌ అయిన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ఎలీస్‌ పెర్రీతో కలిసి మంధాన దుమ్మురేపారు.

వీరిద్దరూ  రెండో వికెట్‌కు 95 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. 50 బంతుల్లో 80 పరుగులు చేసి మంధాన ఔటైంది. యూపీపై రిచా ఘోష్ 10 బంతుల్లో 21 పరుగులు, సోఫీ డివైన్ 2 బంతుల్లో 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. యూపీ బౌలర్లలో అంజలి, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.
 
మార్కుల పట్టికలో మార్పు 

ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని ఖాయం చేసుకుంది. అదే సమయంలో యూపీ ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకుంది. రెండింటి యొక్క నికర రన్ రేట్ వరుసగా 0.242 మరియు -0.073. ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. అదే సమయంలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అదే పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. గుజరాత్ జెయింట్స్ ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించలేదు. దీంతో ఆ జట్టు ఐదో స్థానంలో ఉంది.

click me!