IPL 2024: భారత మాజీ క్రికెటర్ కీలక ప్రకటన చేశాడు. చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలోకి తిరిగి వచ్చిన ఆయన ఓ ప్రత్యేక పోస్ట్‌ను పెట్టి అభిమానులను హడలెత్తించారు. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో చెన్నై తరఫున కొత్త 'పాత్ర'లో ప్రవేశించేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని తన పోస్ట్‌లో రాశాడు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడా? మెంటార్‌గా చేస్తాడా?
IPL 2024: భారత క్రికెట్ చరిత్రలో సక్సెస్ పుల్ కెప్టెన్, ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన ఘనత ఎంఎస్ ధోని సొంతం. అలాంటి క్రికెటర్ సోమవారం ఒక కీలక ప్రకటన చేశాడు. చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలోకి తిరిగి వచ్చిన ఆయన ఓ ప్రత్యేక పోస్ట్‌ను పెట్టి అభిమానులను హడలెత్తించారు. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో చెన్నై తరఫున కొత్త 'పాత్ర'లో ప్రవేశించేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని తన పోస్ట్‌లో రాశాడు. ఇప్పుడు ఈ కొత్త పాత్ర ఏమిటనే ఉత్కంఠ అభిమానుల్లో పెరిగింది. ఈ కొత్త పాత్ర ధోని ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది.
సోషల్ మీడియాలో రచ్చ
మాజీ కెప్టెన్ ధోని పెట్టిన పోస్టు నిమిషాల్లోనే తెగవైరల్ గా మారింది. ఈ తరుణంలో నెట్టింట్లో ధోనీ ఐపీఎల్ కెరీర్ పై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సీజన్ లో అతను ఆటగాడిగా మాత్రమే కనిపిస్తాడని కూడా కొందరు అంటున్నారు. ధోనీ జట్టుకు మెంటార్‌గా ఉంటాడని పలువురు అంటున్నారు. ఇటీవల ఎంఎస్ ధోని ఐపీఎల్‌కు ముందు ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీంతో ఎంఎస్ ధోని ఓపెనింగ్‌లో కనిపిస్తాడని చాలా మంది ఈ పోస్ట్‌పై కామెంట్స్ చేయడం ప్రారంభించారు.
Facebook post of MS Dhoni.
- It's time for the Thala show in IPL 2024. 🦁 pic.twitter.com/vM1HBtrKEa
ధోని ట్రాక్ రికార్డు..
42 ఏళ్ల ధోని 15 ఆగస్టు 2020న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరయ్యాడు. కానీ అతను ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. అతని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. ధోనీ కెప్టెన్సీలో చెన్నై జట్టు గత సీజన్‌లో అంటే 2023లో కూడా విజయం సాధించింది. ఆ తర్వాత ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది.
భారత మాజీ కెప్టెన్ ధోని పేరిట 3 ఐసీసీ ట్రోఫీలు
ధోని పేరు మీద 3 ICC ట్రోఫీలు ఉన్నాయి (2007 T20 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ) ఇలాంటి ఘనత సాధించిన ఏకైక కెప్టెన్ ధోనినే. 5 ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన రికార్డు కూడా ధోని పేరిట ఉంది. 60 టెస్టులు, 200 వన్డేలు, 72 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో కిపింగ్ చేసిన భారత ఏకైక కెప్టెన్ మహి. అతను వివిధ ఫార్మాట్లలో ఎన్నో రిక్డారులున్నాయి. ఒకే వన్డే మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా అత్యధిక స్కోరు (183 నాటౌట్) చేసిన ఆటగాడిగా కూడా ధోనీ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు 31 అక్టోబర్ 2005న జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో శ్రీలంకతో ఆడుతున్నప్పుడు సృష్టించాడు.
ధోనీ కెప్టెన్సీలో ఇదే రికార్డు
ధోనీ తన అంతర్జాతీయ కెరీర్‌లో (టెస్ట్ + వన్డే + టీ20) మొత్తం 332 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. కెప్టెన్‌గా ఇదే అత్యధికం. రికీ పాంటింగ్ 324 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించాడు. ఈ 332 మ్యాచ్‌ల్లో ధోనీ 178 మ్యాచ్‌లు గెలిచి 120 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. 6 మ్యాచ్‌లు టై కాగా 15 డ్రా అయ్యాయి. మహీ 90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10773 పరుగులు, 98 టీ20ల్లో 1617 పరుగులు చేశాడు. 250 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి ధోని 5082 పరుగులు చేశాడు. ఇందులో 142 క్యాచ్‌లు, 42 స్టంప్‌లు కూడా అతని పేరిట ఉన్నాయి.
మోకాలి శస్త్రచికిత్స
IPL 2023లో MS ధోని తన జట్టు CSK కోసం ఆడుతున్నట్లు కనిపించాడు. అతను మొత్తం సీజన్లో జట్టుకు నాయకత్వం వహించి.. ఐదవసారి కూడా ఛాంపియన్ గా నిలిపాడు. ఆ సీజన్‌లో పెరుగుతున్న వయస్సు, క్రికెట్‌కు నిరంతరం దూరంగా ఉండటం వల్ల ఆయన కాస్త ఇబ్బందిపడ్డారు. అయితే.. ఎగిసిన కెరటంలా దూకుడు ప్రదర్శన నిచ్చారు. అతని బ్యాటింగ్ స్టైల్ లో కూడా ఏలాంటి మార్పు మారలేదు. రోజురోజుకు అతనిలో ఉత్సహం పెరుగుతూనే ఉంది. ఈ సీజన్ తర్వాత మహికి మోకాలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. అతను గత నెలలో ప్రాక్టీస్‌కు తిరిగి వచ్చినప్పుడు.. అతను IPL 2024లో ఆడటం ఖాయమని ఊహాగానాలు వచ్చాయి.
రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అవుతాడా?
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌ని మార్చడంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ధోనీ వయస్సు పెరుగుతోంది, అతను ఈ సీజన్ లేదా తదుపరి సీజన్లో మాత్రమే ఆడగలడు. ఇప్పుడు కొత్త కెప్టెన్ , ధోనీ వారసుడి కోసం జట్టు వెతుకుతోంది. ఇప్పుడు ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాడా అనేది ప్రశ్న? ఉత్పన్నమైంది. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వస్తారనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది.
అయితే రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. 2022లో రవీంద్ర జడేజాకు జట్టు పగ్గాలు ఇచ్చినా ఫలితం లేదు. జట్టు ప్రదర్శన క్షీణించింది, సీజన్ మధ్యలో మళ్లీ ధోనీ కెప్టెన్సీని చేపట్టాడు. ఇదిలాఉంటే.. ఇటీవలే జడేజా క్రికెట్ కు స్వస్తి చెప్పాడు. ఈ తరుణంలో ధోని వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ పేరు తెరపైకి వచ్చింది. గతేడాది ఆసియాడ్‌లో భారత టీ20 జట్టుకు రుతురాజ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. మరి సీఎస్‌కే ఈ యంగ్ క్రికెటర్ కు ఇంత పెద్ద బాధ్యత ఇస్తుందో లేదో చూడాలి.