భారత్ చేతిలో ఓట‌మి.. దుబాయ్ బయలుదేరిన ఇంగ్లాండ్ టీమ్ !

By Mahesh Rajamoni  |  First Published Feb 6, 2024, 4:19 PM IST

India vs England: తొలి టెస్టులో ఒట‌మి చ‌విచూసిన భార‌త్ విశాఖ‌లో జ‌రిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ ను 106 ప‌రుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. భార‌త్ చేతితో ఖంగుతిన్న ఇంగ్లాండ్ టీమ్ మూడో టెస్టుకు ముందు దుబాయ్ కి బ‌య‌లుదేరింది.
 


England cricket team: భారత్ -  ఇంగ్లాండ్  జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జ‌రుగుతోంది. ఉత్కంఠ‌ను రేపుతూ కొన‌సాగుతున్న ఈ టెస్టు సిరీస్ లో రెండు టీమ్ చేరో టెస్టు మ్యాచ్ ను గెలిచి 1-1తో స‌మంగా ఉన్నాయి.  హైద‌రాబాద్ లో హోరాహోరీగా సాగిన ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా భార‌త్ పై 28 ప‌రుగుల తేడాతో గెలిచింది. ఇక విశాఖప‌ట్నంలో జ‌రిగిన రెండో టెస్టులో టీమిండియా తొలి టెస్టు ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంటూ ఇంగ్లాండ్ ను చిత్తుచేసింది. 106 ప‌రుగుల తేడాతో బ్రిటీష్ టీమ్ పై గెలిచింది.

బాజ్ బాల్ క్రికెట్ వ్యూహంతో బ‌రిలోకి దిగిన బెన్ స్టోక్స్ సార‌థ్యంలోని ఇంగ్లాండ్ కు రెండో టెస్టులో భార‌త్ బౌల‌ర్లు చుక్క‌లు చూపించాడు. జ‌స్ప్రీత్ బుమ్రా చెడుగుడు ఆడుకున్నాడు. అద్భుత‌మైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ ప‌త‌నాన్ని శాసించాడు. వైజాగ్ లో జ‌రిగిన రెండో టెస్టు త‌ర్వాత ఇంగ్లాండ్ టీమ్ దుబాయ్ కి బ‌య‌లు దేరింది. నాలుగు రోజుల్లో వైజాగ్ టెస్ట్ మ్యాచ్ ముగిసింది. సిరీస్‌లోని మూడో టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 15న రాజ్‌కోట్‌లో ప్రారంభం కానుంది. అయితే మూడో టెస్టుకు ఇంకా 10 రోజుల సమయం ఉండడంతో ఇంగ్లాండ్ టీమ్ విశ్రాంతితో పాటు త‌మ కుటుంబ సభ్యుల‌తో గ‌డ‌ప‌డానికి షెడ్యూల్ చేసింది. దీనిలో భాగంగా ఇంగ్లండ్ జట్టు అబుదాబికి బ‌య‌లు దేరింది. ప్ర‌స్తుతం రిపోర్టుల ప్ర‌కారం.. ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు అబుదాబిలో త‌మ‌ కుటుంబ సభ్యులతో వారం రోజులు గడపనున్నారు.

Latest Videos

undefined

అత‌ను ఛాంపియన్ ప్లేయర్.. ఇంగ్లాండ్ సిరీస్ పై రోహిత్ శ‌ర్మ కామెంట్స్ వైరల్ !

కాగా, రెండో టెస్టు మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ జట్టుకు ఈ విశ్రాంతి అవసరమని అన్నాడు. వ‌రుస మ్యాచ్ ల కార‌ణంగా ప్లేయ‌ర్లు శారీర‌కంగా, మాన‌సికంగా అల‌సిపోతార‌ని పేర్కొన్నాడు. "బ్యాక్-టు-బ్యాక్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడటం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా అలసిపోతారు. గెలిచిన తర్వాత అలసిపోవడం చాలా సులభం. అయితే, మీరు ఓడిపోయినప్పుడు, మీరు మానసిక స్థితి నుండి కోలుకోవడానికి కొంత సమయం కావాలి. కాబ‌ట్టి 3వ టెస్టుకు ముందు ఇంగ్లాండ్ జట్టుకు లభించిన విశ్రాంతి చాలా ముఖ్యమైనదని'' పేర్కొన్నాడు. 

కేన్ మామ సెంచ‌రీల మోత‌.. ఇలాగైతే, స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డులు బ‌ద్ద‌లే !

click me!