U 19 World Cup: భారత్ vs సౌతాఫ్రికా సెమీస్ పోరు.. టాస్ గెలిచిన టీమిండియా

By Mahesh Rajamoni  |  First Published Feb 6, 2024, 1:42 PM IST

India U19 vs South Africa U19: డిఫెండింగ్‌ ఛాంపియన్‌, ఉదయ్‌ సహారన్‌ నేతృత్వంలోని భారత్ జ‌ట్టు ఐసీసీ అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి సెమీస్‌లోనూ ఫేవరెట్‌గా నిలిచింది. గ్రూప్ దశలో 3 మ్యాచ్‌లు, సూపర్-6 దశలో 2 మ్యాచ్‌ల్లో భార‌త్ తిరుగులేని విజ‌యాలు సాధించింది.
 


India U19 vs South Africa U19, Semi-Final: అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ తొలి సెమీ ఫైన‌ల్స్ లో భార‌త్-సౌతాఫ్రికా జ‌ట్టు త‌ల‌ప‌డుతున్నాయి. విల్లోమూర్ పార్క్, బెనోని వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భార‌త్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్ లో యంగ్ ఇండియా తిరుగులేని విజ‌యాల‌తో ఐసీసీ మెగా టోర్నీలో జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగిస్తోంది. ఉదయ్‌ సహారన్‌ నేతృత్వంలోని భారత్ జ‌ట్టు ఐసీసీ అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి సెమీస్‌లోనూ ఫేవరెట్‌గా నిలిచింది. గ్రూప్ దశలో 3 మ్యాచ్‌లు, సూపర్-6 దశలో 2 మ్యాచ్‌ల్లో భార‌త్ తిరుగులేని విజ‌యాలు సాధించింది.

 

🚨 Toss and Team Update 🚨 win the toss and elect to field in Semi-Final 1.

Here's our Playing XI for today 💪

Follow the match ▶️ https://t.co/Ay8YmV8iNI | | pic.twitter.com/m8ZSrGWTvV

— BCCI (@BCCI)

Latest Videos

ఇరు జ‌ట్లు ఇవే..

దక్షిణాఫ్రికా U19 (ప్లేయింగ్ XI):

లువాన్-డ్రే ప్రిటోరియస్(w), స్టీవ్ స్టోల్క్, డేవిడ్ టీగర్, రిచర్డ్ సెలెట్స్‌వేన్, దేవాన్ మరైస్, జువాన్ జేమ్స్(c), ఆలివర్ వైట్‌హెడ్, రిలే నార్టన్, ట్రిస్టన్ లూస్, న్కోబానీ మోకోనా, క్వేనా మఫాకా

ఇండియా U19 (ప్లేయింగ్ XI):

ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్(c), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్(w), మురుగన్ అభిషేక్, రాజ్ లింబానీ, నమన్ తివారీ, సౌమీ పాండే

WI VS AUS: ఇదేం వ‌న్డే గురూ.. 6.5 ఓవ‌ర్ల‌లోనే మ్యాచ్ ముగించారు.. !

click me!