టీమిండియా ప్ర‌త్యేక‌ జెర్సీతో ప్ర‌ధాని మోడీ..

Published : Jul 04, 2024, 04:34 PM IST
టీమిండియా ప్ర‌త్యేక‌ జెర్సీతో ప్ర‌ధాని మోడీ..

సారాంశం

Team India  'Namo 1' Champions jersey : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ట్రోఫీని గెలిచిన భార‌త జ‌ట్టుతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌మావేశ‌మ‌య్యారు. కొద్ది స‌మ‌యం టీమిండియా ఆట‌గాళ్ల‌తో ముచ్చ‌టించారు. వారితో క‌లిసి గ్రూప్ ఫొటోలు కూడా దిగారు. 

India champion jersey: వెస్టిండీస్ వేదిక‌గా జ‌రిగిన టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ఫైన‌ల్ లో ద‌క్షిణాఫ్రికాను ఓడించి భార‌త జ‌ట్టు ఛాంపియ‌న్ గా నిలిచింది. ఐసీసీ ట్రోఫీతో భార‌త గ‌డ్డ‌పై అడుడుపెట్టిన ఛాంపియ‌న్ టీమ్ కు ఘ‌నంగా స్వాగ‌తం ల‌భించింది. ఈ క్ర‌మంలోనే భార‌త‌ ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన టీమిండియా జ‌ట్టుతో స‌మావేశ‌మ‌య్యారు. తన అధికారిక నివాసమైన లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ప్లేయ‌ర్లకు ఆతిథ్యం ఇచ్చారు. కొద్ది స‌మ‌యం టీమిండియా ఆట‌గాళ్ల‌తో ముచ్చ‌టించారు. వారితో క‌లిసి గ్రూప్ ఫొటోలు కూడా దిగారు.

ఈ స‌మావేశానికి రావ‌డం కోసం టీమిండియా ప్ర‌త్యేక  ఛాంపియ‌న్ జెర్సీని ధ‌రించింది. జెర్సీ ముందు భాగంలో 'ఛాంపియన్స్' అని బోల్డ్ అక్షరాల‌తో రాసి ఉంది. ఈ మీట్ త‌ర్వాత భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) అధికారులు కూడా ప్రధాని మోడీని కలిశారు. బీసీసీఐ సెక్రటరీ జైషా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీలు ప్ర‌ధాని మోడీని క‌లుసుకుని ప్ర‌త్యేక‌మైన టీమిండియా "నమో 1" ఛాంపియన్ జెర్సీని అందించారు. బీసీసీఐ త‌న అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఈ విష‌యాన్ని తెలిపింది.

బీసీసీఐ త‌న పోస్టులో.. "విజయవంతమైన భారత క్రికెట్ జట్టు గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీజీని ఆయన అధికారిక నివాసంలో కలుసుకుంది. సార్, మీ స్ఫూర్తిదాయకమైన మాటలకు, టీమిండియాకు మీరు అందించిన అమూల్యమైన మద్దతుకు మేము మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.. జై హింద్" అని పేర్కొంది. ప్రధాని మోడీ కూడా టీ20 ఛాంపియ‌న్ టీమిండియాను క‌లుసుకున్న ఫొటోల‌ను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

 

 

ఢిల్లీలో టీ20 ప్ర‌పంచ క‌ప్ ట్రోఫీతో రోహిత్ శ‌ర్మ డాన్సు.. వీడియో ఇదిగో

 

 

నిజంగా ప్ర‌ధాని మోడీ గొప్ప లీడ‌ర్.. రోహిత్, ద్రవిడ్ కూడా ఇలాంటిది ఊహించివుండ‌రు ! 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ