Team India : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీ గెలిచిన భారత జట్టుతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఆటగాళ్లకు అభినందనలు తెలుపుతున్న సమయంలో ప్రధాని మోడీ చేసిన ఒక పనిపై అందరి నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Team India : టీ20 ప్రపంచ కప్ 2024 లో ఛాంపియన్ గా నిలిచిన భారత జట్టు తుఫాను కారణంగా వెస్టిండీస్ లో చిక్కుకుపోయింది. అయితే, బీసీసీఐ ప్రత్యేక విమానం పంపడంతో భారత ఆటగాళ్లు, ఇతర సిబ్బంది గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. దేశరాజధానిలో భారత ప్లేయర్లకు ఘనంగా స్వాగతం లభించింది. అక్కడి నుంచి భారత ఆటగాళ్లు ఢిల్లీలోని ఐటీసీ మౌర్యకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌కు చేరుకున్నారు.
ప్రధాని నివాసంలో భారత ఆటగాళ్లు మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఐసీసీ ట్రోఫీ గెలిచిన భారత ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. అలాగే, ఆటగాళ్లు, జట్టు సిబ్బందితో కొద్ది సమయం ముచ్చటించారు. టీమిండియాపై ప్రశంసలు కురిపించారు. జట్టుతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ చేసిన పనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా ప్రధాని మోడీ ఒక గొప్ప లీడర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. సంబంధిత వీడియోలు వైరల్ గా మారాయి. అసలు మోడీ ఏం చేశారు? ఆ వీడియోలో ఏముంది?
undefined
సోషల్ తెగ వైరల్ అవుతున్న వీడియోలో భారత ఆటగాళ్లతో ఫొటో సెషన్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రూఫ్ ఫొటో తీసుకుంటున్న సమయంలో ప్రధాని మోడీ టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని అందుకోకుండా.. బదులుగా కెప్టెన్ రోహిత్ శర్మ, టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతులను పట్టుకున్నారు. ఇది రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ లపై ప్రశంసలు కురిపించడమే కాకుండా మోడీ ఒక నిజమైన గొప్ప లీడర్ అనే సందేశాన్ని ఇస్తోంది. ఇది భారత విజయాన్ని ముందుకు నడిపిన సందేశాన్ని ఇవ్వడంతో పాటు జట్టు సభ్యుల ఐక్యత-స్ఫూర్తికి ప్రతీకగా చెప్పవచ్చు. ఇందుకోసమే జట్టుతో పాటు తాను కూడా మీవెంటే.. యావత్ భారతావని వెంట ఉన్నాననే సందేశాన్ని మోడీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని కామెంట్స్ ఇలా ఉన్నాయి..
టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన భారత జట్టు ఆటగాళ్లు, సిబ్బంది ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధాని మోడీని కలిసేటప్పుడు మెన్ ఇన్ బ్లూ ప్రత్యేక జెర్సీని ధరించారు. జెర్సీ ముందు భాగంలో 'ఛాంపియన్స్' అని బోల్డ్ అక్షరాలతో రాసి ఉంది. ప్రధాని మోడీ ఆటగాళ్ల పై ప్రశంసలు కురిపిస్తూ అభినంద… pic.twitter.com/OlIKiZIp76
— Asianetnews Telugu (@AsianetNewsTL)
True Leader ❤️😎 pic.twitter.com/p09Y5cQUTx
— Priyanka M Mishra (@soulfulgirlll)Rohit Sharma and Rahul Dravid held the trophy, and PM Modi held both of their hands. Leader 🔥🔥 pic.twitter.com/sm6dn4Cxo8
— BALA (@erbmjha)
This pic will give solid burn to seculars. 🤣 pic.twitter.com/Zcw1DBzLYd
— Aditya Kumar Trivedi (@adityasvlogs)Setback..Emotions ..Victory ✔️ pic.twitter.com/tvqxmBKeGf
— Jitendra Gautam 🕉️🇮🇳🪷 (@JagrutBharatiya)
TEAM INDIA WITH PM MODI : ప్రధాని నరేంద్ర మోడీతో టీమిండియా.. వీడియో