ఎన్‌పీసీఐకి షాకీవ్వనున్న ఎస్‌బీఐ.. డిజిటల్ పేమెంట్ విభాగంలో కొత్త సంస్థ ఏర్పాటు..

By Sandra Ashok KumarFirst Published Aug 29, 2020, 4:47 PM IST
Highlights

రిటైల్ చెల్లింపుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ అంబ్రిల ఎంటిటీ (ఎన్‌యూ‌ఈ ) ఫ్రేమ్ వర్క్ క్రింద లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది అని ఒక ఎస్‌బి‌ఐ అధికారి చెప్పారు. ఎన్‌యూ‌ఈ కోసం ఫ్రేమ్‌వర్క్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం విడుదల చేసింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) కు షాక్ ఇవ్వనుంది.  డిజిటల్ చెల్లింపుల విభాగంలో కొత్త సంస్థ ఏర్పాటుకు సిద్దమవుతోంది. అంతేకాదు ఇందులో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా భాగస్వామ్యం చేయనుందని తాజా సమాచారం.భారతదేశంలోని  అతిపెద్ద రుణదాత ఎస్‌బి‌ఐ సీనియర్ మేనేజ్మెంట్ ప్రాథమిక చర్చలు జరుపుతోంది.

రిటైల్ చెల్లింపుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ అంబ్రిల ఎంటిటీ (ఎన్‌యూ‌ఈ ) ఫ్రేమ్ వర్క్ క్రింద లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది అని ఒక ఎస్‌బి‌ఐ అధికారి చెప్పారు. ఎన్‌యూ‌ఈ కోసం ఫ్రేమ్‌వర్క్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం విడుదల చేసింది.

ఆమోదం పొందిన సంస్థలు పాన్-ఇండియా డిజిటల్ పేమెంట్ నెట్‌వర్క్‌ను సొంతం చేసుకోవడానికి, నిర్వహించడానికి చెల్లింపుల సంస్థను ఏర్పాటు చేయవచ్చు, ఎన్‌పిసిఐలాగే  అధికారాలను ఉంటాయి. కాగా ఆర్‌బీఐ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఎ) సంయక్త ఆధ్వర్యంలో 2008లో ఎన్‌పీసీఐ ఏర్పాటైంది.

also read 

దేశవ్యాప్తంగా 60 శాతం చెల్లింపు లను వాల్యూమ్‌లను ఎన్‌పీసీఐ నియంత్రిస్తుంది. ఎస్బీఐ సహా, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపీఐ), తక్షణ చెల్లింపు సేవలు (ఐఎం‌పిఎస్), భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (భీమ్) వంటి సేవలను అందిస్తోంది.

చర్చలు ప్రారంభ దశలో ఉన్నప్పటికీ కొత్త పేమెంట్ సంస్థను నిర్మించే మార్గాలలో ఒకటి మేనేజ్ మెంట్ ఆధారిత నమూనా ద్వారా ఎస్బిఐ, ప్రమోటర్‌గా, ఇతర ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులను కన్సార్టియం ఏర్పాటుకు ఆహ్వానించగలదని, మరొక అవకాశం ఎస్బిఐ ఫిన్ టెక్ కంపెనీలతో భాగస్వామ్యం కావడం,

ఇది ప్రభుత్వ యాజమాన్యంలోని రుణదాత డిజిటల్ కార్యక్రమాలను తన బ్యాంకింగ్ ఛానల్ ద్వారా అందించడానికి సహాయపడుతుంది అని ఒక వ్యక్తి చెప్పారు. ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం ఎంటిటీకి గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఎస్‌బిఐకి కనీసం రూ.500 కోట్లు పెయిడ్-అప్ క్యాపిటల్‌గా అందించాల్సి ఉంటుంది.

ఎన్‌పిసిఐ ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, ఇన్స్టంట్ పేమెంట్ వ్యవస్థ, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ వంటి కీలకమైన ఛానెళ్ల ద్వారా 60% పైగా వాల్యూమ్‌లను నియంత్రిస్తుంది. ఆసక్తిగల సంస్థలకు దరఖాస్తులు సమర్పించడానికి ఆర్‌బిఐ ఫిబ్రవరి 2021 వరకు గడువుగా నిర్ణయించింది. దరఖాస్తులను మరో ఆరు నెలల్లో పరిశీలించే ప్రక్రియను పూర్తి చేయాలని సెంట్రల్ బ్యాంక్ భావిస్తోంది.

click me!