ప్రతి ఒక్కరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయాలి.. పర్మనెంట్ వర్క్ ఫ్రోం హోంకి నేను సపోర్ట్ చేయను: నారాయణ మూర్తి

By Sandra Ashok KumarFirst Published Nov 19, 2020, 1:10 PM IST
Highlights

" కోవిడ్ -19 వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి ఉచితంగా వేయాలి. ఈ వ్యాక్సిన్ భూమిపై ఉన్న మొత్తం జనాభాకు ఉచితంగా ఉండాలి. వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే అన్ని సంస్థలకు యుఎన్ లేదా వ్యక్తిగత దేశాలు తమ ఖర్చుల కోసం పరిహారం చెల్లించాలి తప్ప భారీ లాభాల కోసం కాదు ”అని ఎన్ఆర్ నారాయణ మూర్తి ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.
 

న్యూ ఢీల్లీ: ప్రస్తుతం కోవిడ్ -19 వ్యాక్సిన్ చుట్టూ చాలా సానుకూల సంభాషణలు జరుగుతున్నాయి, పెద్ద ఔషధ సంస్థలైన మోడర్న, ఫైజర్-బయోఎంటెక్ వంటి ఇతర సంస్థలు కరోనా వైరస్ వ్యాక్సిన్ ఫలితాలపై ఆశాజనకంగా ఉన్నాయి, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత  ప్రజలు నుండి డబ్బులు వసూలు చేయరాదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి అన్నారు.

" కోవిడ్ -19 వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి ఉచితంగా వేయాలి. ఈ వ్యాక్సిన్ భూమిపై ఉన్న మొత్తం జనాభాకు ఉచితంగా ఉండాలి. వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే అన్ని సంస్థలకు యుఎన్ లేదా వ్యక్తిగత దేశాలు తమ ఖర్చుల కోసం పరిహారం చెల్లించాలి తప్ప భారీ లాభాల కోసం కాదు ”అని ఎన్ఆర్ నారాయణ మూర్తి ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

గత నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) మ్యానిఫెస్టోను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) క్లియర్ చేసిన తర్వాత కోవిడ్ -19 వ్యాక్సిన్‌ ఉచితం అంటూ చేసిన వాగ్దానం ఇక్కడ పేర్కొనడం విశేషం.

also read 

 ఖర్చును భరించగల కంపెనీలు ఎటువంటి ఖర్చు లేకుండా వ్యాక్సిన్ ఉచితంగా ఉత్పత్తి చేయాలని ఉద్ఘాటించారు. అదనంగా, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు ఈ ఖర్చులో ప్రధాన భాగాన్ని పంచుకోవాలి. బారతదేశా జనాభాకు సుమారు 3 బిలియన్ టీకాలు అవసరం అని నారాయణ మూర్తి అన్నారు.

మంగళవారం రోజున కరోనా వైరస్ కేసుల సంఖ్య 38,000కు చేరుకున్నాయి. అంతకుముందు రోజు 30,000 కన్నా తక్కువ నమోదయ్యాయి.

పర్మనెంట్ బేసిస్ కింద వర్క్ ఫ్రమ్ హోమ్(WFH)  కి నేను సపోర్ట్ చేయనని అన్నారు. "కోవిడ్ -19 వ్యాప్తిని తగ్గించడానికి తాత్కాలిక చర్యగా మేము  వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగించాము. మన దేశంలో చాలా ఇళ్ళులు చిన్నవిగా ఉన్నాయని, ఇంట్లో మీరు ఏకాంత ప్రదేశం పొందడం చాలా కష్టం అని ఒక దినపత్రిక నారాయణ మూర్తికి ఉటంకిస్తూ పేర్కొంది.

 తగిన భద్రతలతో తక్కువ వ్యవధిలో స్కూల్స్ తిరిగి తెరవాలనే ఆలోచనకు నారాయణ మూర్తి మద్దతు తెలిపాడు. "పిపిఇలు (వ్యక్తిగత రక్షణ పరికరాలు), సామాజిక దూరం, ఫేస్ మాస్కూలు వంటి అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ స్కూల్స్ మూసివేయకూడదు,”అని ఉద్ఘాటించారు. పేదరిక నిర్మూలనకు రాబోయే 15-20 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 1 కోటి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందని అని మూర్తి అభిప్రాయపడ్డారు.
 

click me!