Budget 2020: అదనపు పన్నులు తొలగించే అవకాశం... గోల్డ్ ఫండ్స్‌కు ఈసారి ఊరట..?

By Sandra Ashok KumarFirst Published Jan 30, 2020, 12:39 PM IST
Highlights

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ సమర్పించిన ఆకాంక్షల చిట్టాలో ముఖ్యంగా బంగారం, కమోడిటీలకు సంబంధించిన ఈటీఎఫ్‌(ఎక్స్‌ఛేంజి ట్రేడెడ్‌ ఫండ్స్‌)పై దీర్ఘకాల  మూలధన ఆదాయం పన్ను కాలపరిమితిని తగ్గించాలని కోరుతున్నాయి.

మధ్యతరగతి జీవులు, స్వల్ప ఆదాయ వర్గాలు రిస్క్‌తీసుకొని స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు సాహసించరు. అటువంటి వారు అత్యధికంగా మ్యూచువల్‌ ఫండ్స్‌వైపు మొగ్గుచూపుతారు. వీటి నిర్వహణ పూర్తిగా నైపుణ్యమున్న ఫండ్‌హౌసుల చేతిలో ఉండటంతో కనీస రాబడి ఖాయమనే బలంగా నమ్ముతారు.

ఇటీవల కాలంలో దేశంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు కూడా పెరిగాయి. ఫండ్‌ల తీరును బట్టి వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో గోల్డ్‌ ఎక్స్‌ఛేంజి, కమోడిటీ ఈటీఎఫ్‌లు ప్రధానమైనవి. ఈ ఫండ్స్‌కు సంబంధించి ప్రభుత్వం  కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

also read Budget 2020:‘ఎగ్గొట్టే వాళ్లకు అప్పులిచ్చినా... బ్యాంకులకు మళ్లీ నిధులివ్వాలా...?

ముఖ్యంగా ప్రజలపై నేరుగా పన్నుల్లో రాయితీలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మాత్రం పరోక్షంగా ఉపయోగపడేలా ఇటువంటి మదుపు పథకాలపై ఉండే అదనపు పన్నులను తొలగించే అవకాశం ఉంది. మరోపక్క అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ దాదాపు 17 పాయింట్లతో తన ఆకాంక్షల జాబితాను ప్రభుత్వానికి సమర్పించింది. 

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ సమర్పించిన ఆకాంక్షల చిట్టాలో ముఖ్యంగా బంగారం, కమోడిటీలకు సంబంధించిన ఈటీఎఫ్‌(ఎక్స్‌ఛేంజి ట్రేడెడ్‌ ఫండ్స్‌)పై దీర్ఘకాల  మూలధన ఆదాయం పన్ను కాలపరిమితిని తగ్గించాలని కోరుతున్నాయి. ప్రస్తుతం మూడేళ్లుగా ఉన్న ఈ కాలపరిమితిని ఏడాదికి కుదించాలంటున్నాయి. అప్పుడే ఈ ఫండ్స్‌ మరింత ఆకర్షణీయంగా ఉంటాయని పేర్కొంది. 

 ఈక్విటీ ఫండ్స్‌, ఈటీఎఫ్‌లపై వినియోగదారులకు విధించే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ను కూడా తొలగించాలనే ప్రతిపాదన చేసింది. ఇప్పటికే ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్స్‌,  యూనిట్‌ లింక్డ్‌ ఇన్స్యూరెన్స్‌ ప్లాన్ల(యూలిప్స్‌)పై ప్రభుత్వం వేర్వేరుగా చూడటం సరికాదని పేర్కొంది.

రెండింటిని పెట్టుబడి పథకాలుగానే చూడాలని వెల్లడించింది. ముఖ్యంగా ఈక్విటీ ఆధారిత పథకాలకు ఎల్‌టీసీజీ పన్ను, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌, డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ల నుంచి మినహాయించాలని  కోరింది. ఇదే విధానాన్ని యూలిప్స్‌కు కూడా వర్తింపజేయాలని పేర్కొంది. 

also read ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రిలయన్స్‌ రోడ్లు...ఎక్కడో తెలుసా...

మ్యూచువల్‌ ఫండ్స్‌ను కూడా నేషనల్‌ పెన్షన్‌ స్కీంతో సమానంగా చూడాలని పరిశ్రమ కోరుతోంది. రిటైర్మెంట్‌ లాభాలను అందజేసే పథకాలపై రూ.1,50,000 వరకు ఆదాయపుపన్ను చట్టం 80సీసీడీ కింద మినహాయింపును ఇవ్వాలని కోరుతోంది. దీంతోపాటు మ్యూచువల్‌ ఫండ్స్‌ అందుబాటులోకి తెచ్చిన పింఛను పథకాలపై కూడా ఈ మినహాయింపు వర్తింపజేయాలంది. మ్యూచువల్‌ ఫండ్ సంస్థలు తమను 80సీసీడీ కింద పరిగణించాలని కేంద్ర ప్రత్యక్షపన్నుల బోర్డుకు దరఖాస్తు చేసుకొనేందుకు ఉన్న సుదీర్ఘ ప్రక్రియను తగ్గించాలని డిమాండ్‌ కూడా ఉంది. 

రుణాధారిత అన్ని రకాల మ్యూచువల్‌ ఫండ్స్‌పై ఉన్న లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్నుల నుంచి ఉపశమనం కల్పించాలని కోరింది. ప్రస్తుతం డిబెంచర్లలో నేరుగా పెట్టుబడి  పెట్టి 12నెలలు పూర్తైతే ఎల్‌టీసీజీ పరిధిలోకి తెస్తున్నారు.. అదే రుణాధార మ్యూచివల్‌ ఫండ్స్‌పై ఎల్‌టీసీజీ నిబంధన కాలపరిమితి 36నెలలుగా ఉంది. 

click me!