LPG price:సామాన్యులపై వంటగ్యాస్ పిడుగు.. దేశీయ, వాణిజ్య సిలిండర్ల ధర మరోసారి పెంపు..

By asianet news teluguFirst Published May 19, 2022, 10:37 AM IST
Highlights

దేశరాజధాని ఢిల్లీలో ఇప్పుడు ఎల్‌పీజీ సిలిండర్ రూ.1000 దాటింది. నేడు 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ రూ.3.50 పెరగగా, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.8 పెరిగింది.  

ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలు గురువారం ఉదయం సామాన్యులకు మరో  షాక్ ఇచ్చాయి. గృహ అండ్ వాణిజ్య ఎల్‌పి‌జి గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఈ నెలలో రెండోసారి ధరలు పెంచారు. దేశరాజధాని ఢిల్లీలో ఇప్పుడు ఎల్‌పీజీ సిలిండర్ రూ.1000 దాటింది. నేడు 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ రూ.3.50 పెరగగా, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.8 పెరిగింది.  

కోల్‌కతాలో సిలిండర్ ధర 
గురువారం నుంచి ఢిల్లీలో రూ.1003, ముంబైలో రూ.1002.50, కోల్‌కతాలో రూ.1029, చెన్నైలో రూ.1018.50కి డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ అందుబాటులో ఉంటుంది. అంతకుముందు మే 7న డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. 

చెన్నైలో వాణిజ్య సిలిండర్
ఇప్పుడు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.2354, కోల్‌కతాలో ధర రూ.2454, ముంబైలో ధర రూ.2306, చెన్నైలో ధర రూ.2507లకు చేరింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1000 దాటింది. ఏడాదిలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.800 నుంచి రూ.1000 దాటింది. 

మరోవైపు , నిరంతరం పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2022-23లో ఉపశమనం కలిగించే అవకాశం లేదని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ బుధవారం నివేదికలో పేర్కొంది. ఈ కాలంలో మొత్తం ఆర్థిక సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 6.9 శాతం వద్ద కొనసాగే అవకాశం ఉంది. 

ఏజెన్సీ ప్రకారం పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్  వడ్డీ రేటు రెపో రేటును 0.75 శాతం పెంచవచ్చు. పరిస్థితి తీవ్రంగా మారితే, పాలసీ రేటును 1.25 శాతం వరకు  కూడా పెంచవచ్చు. దీంతోపాటు నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ని కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 0.50 శాతం నుంచి 5 శాతానికి పెంచవచ్చు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు, మే 4న సెంట్రల్ బ్యాంక్ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ లేకుండానే రెపో రేటును 0.40 శాతం పెంచింది. సీఆర్‌ఆర్‌ను కూడా 0.50 శాతం నుంచి 4.5 శాతానికి పెంచారు. 

సరఫరా సమస్య 
కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో డిమాండ్ తగ్గినప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్ 2020 వరకు 6 శాతం కంటే ఎక్కువగానే ఉంది. దీనికి సరఫరాలో అంతరాయం కూడా ఒక కారణం. 2015-16 నుంచి 2018-19 వరకు వరుసగా నాలుగు సంవత్సరాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.1 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. దీని తర్వాత డిసెంబర్ 2019లో మొదటిసారిగా ఇది 6 శాతం దాటింది, అంటే ఇది RBI గరిష్ట పరిమితి కంటే ఎక్కువ.  

click me!