మునిగిపోతున్న లక్ష్మి విలాస్ బ్యాంక్ కథ.. గత 10 సంవత్సరాలలో 5 మంది సిఇఓలు మారారు..

By Sandra Ashok KumarFirst Published Nov 20, 2020, 10:48 AM IST
Highlights

ఈ 94 ఏళ్ల బ్యాంకు 80 సంవత్సరాలకు పైగా బాగా నడిచింది, అయితే గత దశాబ్దంలో సమస్యలు రావడం ప్రారంభించాయి. ఈ దశాబ్దంలో బ్యాంక్ 5 మంది సిఇఓలు మారారు. ఏ ఒక్క సి‌ఈ‌ఓ కూడా రెండు లేదా మూడు సంవత్సరాలకు మించి ఉండలేదు. 

గత కొన్నేళ్లుగా మునిగిపోయిన బ్యాంకుల జాబితాలో లక్ష్మి విలాస్ బ్యాంక్ పేరు కూడా వచ్చి చేరింది. ఈ 94 ఏళ్ల బ్యాంకు 80 సంవత్సరాలకు పైగా బాగా నడిచింది, అయితే గత దశాబ్దంలో సమస్యలు రావడం ప్రారంభించాయి. ఈ దశాబ్దంలో బ్యాంక్ 5 మంది సిఇఓలు మారారు.

ఏ ఒక్క సి‌ఈ‌ఓ కూడా రెండు లేదా మూడు సంవత్సరాలకు మించి ఉండలేదు. ఇది కాకుండా మరో సమస్య ఏమిటంటే బ్యాంక్ ఆర్థిక స్థితి కంటే ఎక్కువ రుణాలను పంపిణీ చేసింది. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో మిడ్-సైజ్ కంపెనీలకు కార్పొరేట్ రుణాలను కూడా పంపిణీ చేసింది, ఈ చిక్కుల కారణంగా బ్యాంకును నిర్వహించడం కష్టమైంది.

ప్రైవేటు రంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఆరవ వంతుకు సమానమైన ఈ బ్యాంకు మౌలిక సదుపాయాలు, విద్యుత్, రియల్ ఎస్టేట్, నిర్మాణం, వస్త్రాలు వంటి డజను రంగాలకు పెద్ద ఎత్తున రుణాలు పంపిణీ చేసినట్లు సమాచారం.

అయితే ఈ కార్పొరేట్ రుణాల కారణంగా బ్యాంకు పతనం ప్రారంభమైంది. యెస్ బ్యాంక్ వైఫల్యం గురించి మాట్లాడుతూ ప్రమాదకర రంగాలకు పెద్ద మొత్తంలో రుణాలు పంపిణీ చేయడం వల్ల లక్ష్మి విలాస్ బ్యాంక్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. వి.ఎస్.రెడ్డి 2007 నుండి 2010 వరకు  దక్షిణ భారత బ్యాంకులకు సి‌ఈ‌ఓగా ఉన్నారు.

అప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న సమయం. ఆ సమయంలో మౌలిక సదుపాయాలు, లోహాలు, నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. లక్ష్మి విలాస్ బ్యాంక్ కూడా ఈ రంగాలపై భారీ రుణాలు అందించింది.

also read 

తరువాత కొద్ది కాలానికి ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఏర్పడినప్పుడు, బ్యాంకు మూలధనం చిక్కుకున్నట్లు కనిపించింది, ఇది కాస్త బ్యాంక్ మునిగిపోవడానికి కారణం అయ్యింది.

బ్యాంకింగ్ రంగంలో రుణాల వ్యాపారం విషయానికి వస్తే కార్పొరేట్ రుణాలు సులభమైన లక్ష్యాలు, రిటైల్ రుణాల వ్యాపారంలో గట్టి పోటీ ఉంది. అటువంటి పరిస్థితిలో బ్యాంకులు వేగంగా వృద్ధి చెందడానికి కార్పొరేట్ రుణాల వైపు మొగ్గు చూపుతాయి, అయితే దీని వల్ల ఒక్కోసారి ప్రమాదం కూడా ఎక్కువ.

2007 నుండి 2010 వరకు బ్యాంక్ లోన్ బుక్ మొత్తం దాదాపు 3,612 కోట్ల రూపాయల నుండి 6,277 కోట్లకు రెట్టింపు అయ్యింది.

వి.ఎస్.రెడ్డి తరువాత, ఆర్.ఆర్.సోమసుందరం బ్యాంక్ పగ్గాలు చేపట్టారు, కాని అతను కూడా ఒక సంవత్సరం పాటు ఉండి నవంబర్ 2012లో మారిపోయారు. సోమసుందరానికి హిందూస్థాన్ యూనిలీవర్, విదేశీ బ్యాంక్ స్టాండర్డ్ చార్టర్డ్‌లో పనిచేసిన అనుభవం ఉంది.

బ్యాంక్ లోన్ బుక్ మొత్తం మార్చి 2010లో రూ .6,277 కోట్లు కాగా, మార్చి 2013లో ఇది రూ .11,702 కోట్లకు పెరిగింది. ఇవే కాకుండా, ఫార్మా, లోహాల వ్యాపారం, ఇంజనీరింగ్, సిమెంట్ కంపెనీలకు కూడా బ్యాంకు రుణాలు ఇచ్చింది.

ఎన్‌పిఎతో బ్యాంకు నిరంతరం ఇబ్బందుల్లో పడటానికి ఇదే కారణం, అలాగే నిధులు సరిగా లేకపోవడంతో ప్రస్తుతం మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది.
 

click me!