వాహనాలపై తగ్గనున్న జి‌ఎస్‌టి.. త్వరలో ఆటోమొబైల్‌ పరిశ్రమకు మంచిరోజులు..: కేంద్ర మంత్రి

By Sandra Ashok KumarFirst Published Sep 5, 2020, 2:40 PM IST
Highlights

ఎస్‌ఐ‌ఏ‌ఎం 60వ వార్షిక సదస్సులో జవదేకర్ మాట్లాడుతూ జి‌ఎస్‌టి సమస్యలపై మేము ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో చర్చలు జరుపుతున్నాం అని అన్నారు. వాహన స్క్రాపేజ్ విధానంపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వాటాదారుల నుండి అన్ని ఇన్ పుట్ లను అందుకుంది. స్క్రాపేజ్ విధానంపై త్వరలో ప్రకటన చేయనున్నట్లు జవదేకర్ తెలిపారు. 

అన్ని రకాల వాహనాలపై వస్తు, సేవల పన్ను (జి‌ఎస్‌టి) రేట్లను 10% తగ్గించాలని ఆటోమొబైల్ పరిశ్రమల సిఫారసుపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల మంత్రి ప్రకాష్ జవదేకర్ శుక్రవారం అన్నారు. త్వరలో దీనిపై  ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.

ఇండస్ట్రీ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్‌ఐ‌ఏ‌ఎం) 60వ వార్షిక సదస్సులో జవదేకర్ మాట్లాడుతూ జి‌ఎస్‌టి సమస్యలపై మేము ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో చర్చలు జరుపుతున్నాం అని అన్నారు. వాహన స్క్రాపేజ్ విధానంపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వాటాదారుల నుండి అన్ని ఇన్ పుట్ లను అందుకుంది. స్క్రాపేజ్ విధానంపై త్వరలో ప్రకటన చేయనున్నట్లు జవదేకర్ తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తితో భారత ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. ఈ మహమ్మారి వల్ల ఆటోమొబైల్ పరిశ్రమలో డిమాండ్‌ను మరింత దిగజార్చింది.

"ప్రయాణీకుల వాహన విభాగం గత రెండు దశాబ్దాలలో తొమ్మిది త్రైమాసికాలలో మందగమనాన్ని చూసింది. అదేవిధంగా వాణిజ్య వాహనాలు గత 15 సంవత్సరాలలో ఐదు త్రైమాసికాల వరకు రెండవ అతి పెద్ద మందగమనాన్ని ఎదుర్కొన్నాయి. ద్విచక్ర వాహనాల విభాగంలో ఆరు త్రైమాసికాల వరకు నిరంతర మందగమనం కనిపించింది " అని ఎస్‌ఐ‌ఏ‌ఎం అధ్యక్షుడు రాజన్ వాధేరా అన్నారు.  

also read 

ద్విచక్ర వాహనాలపై జి‌ఎస్‌టి రేటు తగ్గింపు ప్రస్తుతం 28% వద్ద ఉంది, ఇది తయారీదారుల నుండి చాలాకాలంగా ఉన్న అభ్యర్థన. ద్విచక్ర వాహనాలపై జి‌ఎస్‌టిని తగ్గించే ప్రతిపాదనను జి‌ఎస్‌టి కౌన్సిల్ పరిశీలిస్తుందని ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.

కొన్ని రకాల డిమాండ్ బూస్టర్‌లను అందించడానికి ప్రభుత్వ సహకారాన్ని కోరుతూ  వాధేరా  "రాబోయే ప్రభుత్వ నిబంధనల అమలులో తయారీదారులు మరింత పెట్టుబడులు పెట్టే స్థితిలో లేరని" పేర్కొన్నారు. కాబట్టి 2022 నుండి కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ (సి‌ఏ‌ఎఫ్‌ఈ) నిబంధనల వంటి కొత్త నిబంధనల అమలులో పరిశ్రమకు మరింత పెట్టుబడులు పెట్టే సామర్థ్యం లేదని ఆయన పేర్కొన్నారు. ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2026 (AMP 2026) కింద నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ సహకారం అవసరమని వాధేరా తెలిపారు.

వాహన ఫైనాన్సింగ్ గురించి కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయ్ కోటక్ మాట్లాడుతూ "ఆటో సెక్టార్ దీర్ఘకాలిక పునాది కోసం మౌలిక సదుపాయాలలో ముఖ్యంగా పెట్టుబడులు అవసరం. ఎస్‌ఐ‌ఏ‌ఎం ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలి" అని అన్నారు.
 

click me!