బడ్జెట్ 2020: చిన్న పరిశ్రమలకు ‘ఫండ్స్ ఆఫ్ ఫండ్స్’: సిన్హా కమిటీ సిఫారసులకు ఓకే

By narsimha lodeFirst Published Jan 19, 2020, 1:20 PM IST
Highlights

చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కేంద్ర బడ్జెట్‌లో  రాయితీల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. 

న్యూఢిల్లీ: దేశీయంగా సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభ్యున్నతి కోసం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్’ ఆవిష్కరించాలని కోరుతున్నాయి. ఎంఎస్ఎంఈ పరిశ్రమల నిధుల అవసరాల కోసం ఈ నిధిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెప్పారు. 

also read:నార్త్ బ్లాక్‌లో హాల్వా సెర్మోనీ రేపే? కీలక దశకు బడ్జెట్ కసరత్తు!!

స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ మాజీ చైర్మన్ యూకే సిన్హా సారథ్యంలోని కమిటీ చూసిన నిబంధనలకు అనుగుణంగా ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్ అమలులోకి వస్తుందని భావిస్తున్నారు. 2019 జూన్ నెలలో ఏర్పాటైన ఈ కమిటీ చిన్న, మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమల అభ్యున్నతికి నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 

ఎంఎస్ఎంఈ సెక్టార్ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టే వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు మద్దతుగా నిలిచేందుకు రూ.10 వేల కోట్ల ఫండ్ ఏర్పాటు చేయాలని ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ పేర్కొంది. 

2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎంఎస్ఎంఈలకు ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ స్కీమ్ పొడిగించనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ 2018 నవంబర్‌లో ప్రకటించారు. ఈ ఇంటరెస్ట్ సబ్‌వెన్షన్ స్కీమ్ కొనసాగిస్తామని ఓ అధికారి తెలిపారు. 

జీఎస్టీ రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలు తీసుకున్న తాజా, ఇంక్రిమెంటల్ లోన్లపై రెండు శాతం ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ అమలు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ పథకాన్ని 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో అమలు చేశారు. ఉత్పాదకత, సేవలు పెంపొందించేందుకు మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టార్ సంస్థలకు ఈ పథకం అమలైంది. 

2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు రూ.12 వేల కోట్లు కేటాయించాలని ఇప్పటికే ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ ఆర్థిక శాఖను కోరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులతో పోలిస్తే ఇది 70 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంఎస్ఎంఈ సెక్టార్ పరిశ్రమల అభివ్రుద్ధికి కేంద్ర బడ్జెట్ లో రూ.7,011 కోట్లు కేటాయించింది. 

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సారథ్యంలోని ఎంఎస్ఎంఈ శాఖ ఈ నిధుల్లో 78 శాతం సద్వినియోగం చేసింది. గ్రామీణ రంగంలో పెట్టుబడులు, ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించడంపైనే తాము ద్రుష్టి పెట్టామని ఎంఎస్ఎంఈ శాఖ అధికారి ఒకరు తెలిపారు. 

ఎంఎస్ఎంఈ క్లస్టర్లను అభివ్రుద్ధి చేయడంపైనే తాము ద్రుష్టిని కేంద్రీకరించామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గ్రామీణ రంగంలోనూ, గిరిజన ప్రాంతాలకు గరిష్ఠంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశ జీడీపీలో ఎంఎస్ఎంఈల వాటా 29 శాతంగా ఉంది. వచ్చే ఐదేళ్లలో దాన్ని 50 శాతానికి తీసుకెళ్లాలని ఎంఎస్ఎంఈ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. 

click me!