సంక్రాంతి నుండి నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు...

By Arun Kumar PFirst Published Jan 5, 2019, 10:45 AM IST
Highlights

సంక్రాంతి నుండి హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి  తీసుకువస్తున్నట్లు ఆర్టీసి అధికారులు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్-శంషాబాద్ మార్గంలో బస్సులను ప్రయోగాత్మకంగా నడుపుతూ పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత వీటిని నగరంలో తిప్పనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

తెలంగాణ ఆర్టీసి ఇంధన ఖర్చులు తక్కువగా, పర్యావరణానికి హితంగా  వుంటాయన్న ఉద్దేశ్యంతో ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టిసిలో భాగం చేయాలని అధికారులు భావించారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల పనితీరుపై  ఇంకా స్పష్టత లేకపోవడంతో వాటిని కొనుగోలు చేసే సాహసం చేయలేదు. కాని అద్దె పద్దతిలో కొన్ని బస్సులను ఆర్టిసి తరపున నడపడానికి ఓ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 

ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం 100 ఎలక్ట్రికల్ బస్సులు నగర ప్రయాణికులను అందుబాటులోకి రానున్నాయి. మొదటి విడతగా 40 బస్సులు ఈ సంక్రాంతి నుండి ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ రోడ్లపైకి రానున్నాయి. మియాపూర్, కంటోన్మెంట్ రెండు డిపోలకు 20 చొప్పున 40 బస్సులను కేటాయించారు. 

ముఖ్యంగా ఈ బస్సులను నగరంలోని వివిధ ప్రాంతాల నుండి శంషాబాద్ విమానాశ్రయానికి నడపనున్నారు.అందువల్లే ఆ రూట్లలో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు.  
 
click me!