ఉత్తర ఫల్గుని కార్తెతో వ్యవసాయానికి సంబంధం ఏంటీ..?

By Siva KodatiFirst Published Sep 13, 2020, 6:58 PM IST
Highlights

భారతీయ జ్యోతిష సాంప్రదాయ ప్రకారం ఒక్కో కార్తె ప్రకృతిలో మార్పు ఎలా ఉండ బోతున్నది అనే అంశం మీద మన పూర్వీకులైన ఋషులు పరిశోధన చేసి అనుభవంలోకి వచ్చిన వాటిని శాస్త్ర రూపంలో వివరించడం జరిగింది

భారతీయ జ్యోతిష సాంప్రదాయ ప్రకారం ఒక్కో కార్తె ప్రకృతిలో మార్పు ఎలా ఉండ బోతున్నది అనే అంశం మీద మన పూర్వీకులైన ఋషులు పరిశోధన చేసి అనుభవంలోకి వచ్చిన వాటిని శాస్త్ర రూపంలో వివరించడం జరిగింది.

ఈ కార్తెల ఆధారంగా వ్యవసాయ దారులు, జానపదులు ( గ్రామీన ప్రాంతం వారు) ఎక్కువగా కార్తెలపై ఆధారపడి చేసే వృత్తులు, వ్యవసాయ సాగు. ఈ కాలగణనతో కార్తెలకు అనుగుణంగా వారు పండించే పంటలపై ఒక నిర్ణయం చేసుకుని కాలానుగుణంగా వ్యవసాయ సాగు చేస్తూ వస్తున్నారు. సూర్యుడు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ప్రవేశించిన రోజు నుండి ఉత్తర ఫల్గుని కార్తెగా  పిలువబడుతుంది. 

పంచాగ ప్రకారం:-  ఉత్తర ఫల్గుని నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాభావాన్ని, వాతావరణాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్య జీవనోపాధిగా వ్యవసాయ పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి.

ఈ మాసంలో రవి ఉత్తర మొదటి పాదంలోకి తేది 13 సెప్టెంబర్ 2020 ఆదివారం రోజు సింహరాశిలో ఉదయం 9:03 నిమిషాలకు ప్రవేశం చేస్తునాడు. ( కాలయోగం పంచాంగము - పంచాంగకర్త శ్రీ శ్రీనివాస గార్గేయ దైవజ్ఞ వారి ఘనాంక ఆధారంగా తెలియ జేయడం జరిగినది )

కార్తె ప్రారంభం :- చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ఏ నక్షత్రం సమీపంలో ఉంటే. ఆ కార్తెకు ఆ పేరు పెడతారు... అశ్వినితో ప్రారంభమై రేవతితో ముగిసే వరకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల పేర్లతో కార్తెలు ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తర ఫల్గుని నక్షత్రానికి చేరువలో చంద్రుడు ఉండటం వల్ల దీనికి ఉత్తర ఫల్గుని కార్తె అనే పేరు వచ్చింది. 

ఉత్తర ఫల్గునీ కార్తె ఫలము :- భాద్రపద బహుళ ఏకాదశి, ఆదివారం 13-09-2020 రోజున రాత్రి 11:56 నిమిషాలకు రవి నిరయన ఉత్తర ఫల్గునీ కార్తె ప్రవేశం ప్రవేశ సమయమునకు పుష్యమి నక్షత్రం, మిధునలగ్నం, అగ్ని మండలము, పాదజలరాశి, స్త్రీ-పుంయోగం, మూషిక వాహనం, రవ్వాది గ్రహములు, రస, రస, వాయు, సౌమ్య, సౌమ్య, జల, రస, నాడీచారము మొదలగు శుభాశుభయోగములచే 

13 , 14 సువృష్టి యోగం, 

15 ,16 మేఘాడంబరమగుచూ సామాన్య వృష్టి.

17 , 18 దేశ భేదమున సువృష్టి. 

19 వాతావరణంలో మార్పు. 

20 వాయు సహిత వృష్టి . 

21 , 22 , 23 తీర ప్రాంతాలలో తుఫాన్, వాయుగుండ సూచనలు, ఇతరత్రా వర్షములు. 

24 , 25 , 26  మేఘాడంబరము , ఖండవృష్టియోగం. 

సరాసరిగా ఈ కార్తెలో  సువృష్టి యోగములచే నదులు, జలాశయములలోకి మధ్యమోన్నతముగా నీరుచేరే అవకాశాము కలగవచ్చును ( పంచాంగకర్త శ్రీ  చంద్రశేఖర శర్మ సిద్దాంతి గారిచే గుణించబడిన పంచాంగ ఆధారంగా ఫలితాలు తెలియజేయడమైనది.  

 

డా.యం.ఎన్.చార్య -

ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.

సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

 

click me!