వికారినామ సంవత్సర కుంభరాశి ఫలితాలు

Published : Apr 06, 2019, 07:00 AM IST
వికారినామ సంవత్సర కుంభరాశి ఫలితాలు

సారాంశం

కుంభరాశి వారి ఫలితాలు ఇలా ఉన్నాయి

కుంభం : (ధనిష్ట3,4 పా.శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా) : ఆదాయం -5, వ్యయం - 2; రాజపూజ్యం - 5, అవ - 4;

          ఈ రాశివారికి గురువు నవంబర్‌ వరకు దశమంలోను నవంబర్‌ 2019 తర్వాత లాభంలో సంచారం ఉంటుంది. గురువు దశమ సంచారం వలన వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు లభిస్తుంది. శ్రమతో ఫలితాల సాధన చేస్తారు. అనేక కార్యక్రమాల భారం పెరుగుతుంది. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు చోటుచేసుకుటాంయి. మాట విలువ పెరుగుతుంది.

వాహనాలు గృహ, సంబంధాంశాల్లో శ్రమతో ఫలితాలు సాధిస్తారు. పెద్దలతో వ్యతిరేకతలు ఉంటాయి. లాభంలో సంచారం వలన అన్ని పనుల్లో ప్రయోజనాలు ఉంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పెద్దవారి సహకారం లభిస్తుంది. దైవిక, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. సోదరవర్గం వారితో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి.

శని జనవరి 2020 వరకు లాభంలో సంచారం 2020 జనవరి తర్వాత వ్యయ సంచారం ఉంటుంది. శని లాభ సంచారం వలన అన్ని రకాల లాభాలు ఉంటాయి. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆలోచించాలి. అన్ని పనుల్లో ఆలస్యాలకు అవకాశం ఉంటుంది. ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. సంతాన సమస్యలు ఉంటాయి. శని వ్యయ సంచారం వలన విశ్రాంతిలోపాలకు అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులు ఉంటాయి. పరామర్శలు చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి.

రాహువు పంచమ సంచారం వలన ఆలోచనల్లో క్రియేటివిటీ  తగ్గుతుంది. సంతానవర్గ సమస్యలు అధికం అవుతాయి. మానసిక ప్రశాంతతకై ప్రయత్నిస్తారు. కేతువు లాభంలో సంచరించడం వలన పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.  సంతృప్తికర జీవితం గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. దూర ప్రయాణాలు చేస్తారు. వీరు విష్ణు సహస్రనామ పారాయణ గణపతి స్తోత్రాలు చదువుకోవడం మంచిది.

ఏకాత్మభావన : ఈశ్వరోగురురాత్మేతి మూర్తి త్రి త్రయ స్వరూపిణే ఆనందాత్మ స్వరూపాయ దక్షిణామూర్తయే నమః

ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉన్న రాశులు :  సింహం, ధనుస్సు, మీనం

గృహప్రాప్తి మంత్రం :  చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగరనాయికా, 

ఇల్లు కాకుండా స్థలం కొనుక్కుందామనుకుంటే

స్థల ప్రాప్తి మంత్రం : శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ, త్రివిక్రమాయ నమః,

దాన ధ్యానం : జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి. ఈ జపాలు చేసుకుంటూ ఉండాలి.

డా.ఎస్.ప్రతిభ

ఇతర రాశుల వారి ఉగాది ఫలితాలు

మేషరాశి ఫలితాలు

వృషభరాశి ఫలితాలు

మిథునరాశిఫలితాలు

కర్కాటక రాశివారి ఫలితాలు

సింహరాశి ఫలితాలు

కన్యారాశి ఫలితాలు

తులరాశి ఫలితాలు

వృశ్చిక రాశి ఫలితాలు

ధనస్సురాశి ఫలితాలు

మకర రాశి ఫలితాలు

PREV
click me!

Recommended Stories

AI Horoscope: ఓ రాశివారికి ఈ రోజు ఊహించని ధనలాభం
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు విషయంలో కుటుంబ సభ్యులతో గొడవలు తప్పవు!