వికారినామ సంవత్సర మకరరాశి ఫలితాలు

Published : Apr 06, 2019, 06:53 AM IST
వికారినామ సంవత్సర మకరరాశి ఫలితాలు

సారాంశం

తెలుగు సంవత్సరాదిలో మకర రాశి ఫలితాలు ఇలా ఉన్నాయి

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4 పా. శ్రవణం, ధనిష్ఠ 1,2 పా) : ఆదాయం - 5, వ్యయం - 2; రాజపూజ్యం - 2, అవ - 4;

          ఈ రాశివారికి గురువు నవంబర్‌ 2019 వరకు లాభంలోను 2019 నవంబర్‌ 4 తరువాత వ్యయంలో సంచారం ఉంటుంది.లాభంలో సంచరించడం వల్ల శ్రమతో లాభాలుటాంయి. వేరు వేరు ప్రయోజనాలపై దృష్టి సారిస్తారు. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదరవర్గంతో అనుకూలత. దగ్గరి ప్రయాణాలుటాంయి. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాల్లో శుభపరిణామాలు. పరిచయాలు విస్తరిస్తాయి. భాగస్వామ్య స్నేహానుబంధాల్లో అనుకూలత.

2019 నవంబర్‌ తర్వాత వ్యయ సంచారం వలన ధార్మిక ఖర్చులు ఉంటాయి. శుభకార్యక్రమాల నిర్వహణ ఉపయోగపడుతుంది. అనుకోని ఇబ్బందులు వస్తాయి. గృహనిర్మాణాలకై ఖర్చు అధికంగా చేస్తారు. పెద్దలతో పోటీ లు పెట్టుకోకూడదు. అనుకోని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. శని వ్యయంలో సంచరించడం వలన విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. నిద్రపట్టకపోవచ్చు. అసుపత్రుల్లో పరామర్శలు ఉంటాయి. వ్యర్థమైన ప్రయాణాలకు అవకాశం.

కుటుంబంలో, ఆర్థిక నిర్వహణలో ఇబ్బందులు అధికం. వ్యతిరేకతలను అధిగమిస్తారు. పోటీ ల్లో విజయం. అసంతృప్తి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో అనుకూలత. జనవరి 2020 తర్వాత జన్మరాశిలో సంచరించడంవలన కొంత పనుల్లో ఆలస్యం అవుతుంది. ఒత్తిడితో పనులు పూర్తి చేస్తారు.  వాయిదా పనికిరాదు. యోగా, ప్రాణాయామాదులు తప్పనిసరిగా ప్రతిరోజూ చేసుకోవాలి. రాహువు షష్ఠ సంచారం వల్ల పోటీ లు అధికంగా ఉంటాయి. ఎక్కువ శ్రమతో ఫలితాలు సాధిస్తారు.

వ్యతిరేకతలపై విజయం ఉంటుంది. కేతువు వ్యయ సంచారం వలన ఖర్చులుటాంయి. కాలం ధనం వ్యర్థం అవుతాయి. నిద్రలోపాలు ఉంటాయి. అనవసర ఖర్చులు చేస్తారు. వీరు గణపతి ఆరాధన, విష్ణుసహస్రనామ పారాయణం వినడం తప్పనిసరి.

ఏకాత్మభావన : ఈశ్వరోగురురాత్మేతి మూర్తి త్రి త్రయ స్వరూపిణే ఆనందాత్మ స్వరూపాయ దక్షిణామూర్తయే నమః

ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉన్న రాశులు :  సింహం, ధనుస్సు, మీనం

గృహప్రాప్తి మంత్రం :  చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగరనాయికా, 

ఇల్లు కాకుండా స్థలం కొనుక్కుందామనుకుంటే

స్థల ప్రాప్తి మంత్రం : శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ, త్రివిక్రమాయ నమః,

దాన ధ్యానం : జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి. ఈ జపాలు చేసుకుంటూ ఉండాలి.

డా.ఎస్.ప్రతిభ

ఇతర రాశుల వారి ఉగాది ఫలితాలు

మేషరాశి ఫలితాలు

వృషభరాశి ఫలితాలు

మిథునరాశిఫలితాలు

కర్కాటక రాశివారి ఫలితాలు

సింహరాశి ఫలితాలు

కన్యారాశి ఫలితాలు

తులరాశి ఫలితాలు

వృశ్చిక రాశి ఫలితాలు

ధనస్సురాశి ఫలితాలు

PREV
click me!

Recommended Stories

Sun Moon Conjunction: 2026లో సూర్య చంద్ర సంయోగం, ఈ 3 రాశులకు కొత్త ఇంటి యోగం
Kubera Yoga: గ్రహాల మార్పులతో కుబేర యోగం....ఈ రాశుల జీవితంలో కనక వర్షం కురవడం ఖాయం